ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయ్యింది. కొంత మంది ఫోన్ లో మాట్లాడుతూ ఈ లోకాలనే మర్చిపోతుంటారు.. ఆ సమయంలో తమ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోరు. మరికొంత మంది రోడ్లపై ఫోన్ లో మాట్లాడుతూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటారు. ఓ మహిళ రోడ్డుపై ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్లి మ్యాన్ హూల్ లో పడిపోయింది. సమయానికి పక్కనే కొంత మంది ఉండి ఆమెను రక్షించారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ రోడ్డు పై వెళ్తున్న సమయంలో సీరియస్ గా ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ సమయంలో వెనుక నుంచి హారన్ కొడుతూ పలు వాహనాలు పక్క నుంచి వెళ్తున్నా ఆమె పట్టించుకోకుండా వెళ్తున్న సమయంలో మ్యాన్ హూల్ లో పడిపోయింది. దాదాపు ఆ మ్యన్ హోల్ ఏడు అడుగుల లోతు ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆ మ్యాన్‌హోల్ నుంచి ఆమెను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో ఆ మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అందుకే రోడ్డు పై నడిచే సమయంలో ఫోన్ లో మాట్లాడాల్సి వస్తే చుట్టు పక్కల గమనించాలి.. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.