నేటి కాలంలో అక్రమసంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల వల్ల అతి దారుణంగా హత్యలు కూడా జరుగుతున్నాయి. అలా అనేకమంది జీవితాలను కోల్పోతున్నారు. ఇంకా కాపురాలను చేతుల్లారా నాశనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో ప్రతాప్ గడ్ జిల్లాలో కుంటలో నివాసం ఉంటున్న సంతోష్ సింగ్, తన భార్య ఇద్దరు కుమారులు, ఓక కుమార్తె వీళ్లందరూ కుంటలో నివసిస్తూఉంటారు. అయితే సంతోష్ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అలా గత కొన్ని రోజుల నుంచి వీళ్ల కాపురం సాఫీగానే సాగుతూ వస్తుంది. సింగ్ తన భార్య కు తెలియకుండా ఓ మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ల భాగోతం గత కొన్ని నెలల నుంచి ఎవరికి తెలియకుండా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్యకు కొన్నాళ్ల నుంచి సింగ్ మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పటి నుంచి సింగ్ భార్య తనను గమనించుకుంటూ ఉండేది. అలా కొన్నాళ్లయ్యాక సంతోష్ ని మందలించింది భార్య. అయినా కానీ సంతోష్ లో మాత్రం ఏ లాంటి మార్పు అనేది కనిపించడం లేదు.
రోజు రోజు కి సింగ్ తన ప్రియురాలి తో హాయిగా ఉల్లాసంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. దీంతో సింగ్ భార్య ఏదో ఒకటి చేసి నేను వాళ్లిద్దరిని రెడ్ హ్యండ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. అతని మీదనే నిఘా ఉంచి.. ఓ రోజు సింగ్ భార్య జూన్ 12 న భర్త చేష్టాలను అంతా బయట పెట్టాలనుకుంది. అయితే తన ఇద్దరు కుమారులు, తన కుమార్తె అందరూ కలిసి సింగ్ ప్రియురాలి ఇంటికి బయలు దేరింది. ఆ సమయంలోనే తను అనుకున్నట్టు గానే ప్రియురాలితో ఉన్న తన భర్తను రెడ్ హ్యండ్ గా పట్టుకుంది.
ఆ తర్వాత ప్రియురాలిని సింగ్ భార్య తీవ్రంగా కొట్టింది. ఆ క్రమంలోనే తన కొడుకులు అక్కడ జరుగుతున్న సంఘటనను అంతా వీడియో రూపంలో తీసారు. అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా తన భర్తను ప్రియురాలిని చెప్పుతో కొట్టింది. ఇంకా అంతే కాదు.. ఆమె అతని జుట్టు పట్టుకొని చెంప మీద కొట్టడం వీడియోలో రికార్డు అయ్యింది. అదే విధంగా ప్రియురాలికి గుణపాఠం చెబుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మరింత చక్కర్లు కొడుతుంది.