అర్ధాంగి, పత్ని, భార్య ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా సరే.. తన వాళ్లందరినీ వదిలి పుట్టినింటి నుంచి మెట్టినింట అడుగుపెట్టేది మహిళ. అప్పటి నుంచి అన్నీ, తన సర్వస్వం తన భర్త అనే భావనతోనే ఉంటుంది భార్య. అలాంటి భర్తకు ఏ చిన్న అపాయం జరుగుతుందన్నా.. కష్టమొస్తుందని తెలిసినా తానే ముందుంటుంది. నార్తిండియాలో తన భర్త క్షేమంగా ఉండాలంటూ కర్వా చౌత్‌ను జరుపుకుంటారని తెలిసిందే. మరి అదే రోజు ఒక కేసులో నిందితుడు అయిన తన భర్తను పోలీసులకు పట్టించింది ఓ భార్య. ఆమె నిబద్ధతకు, నిజాయితీకి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి: తెలంగాణ మొత్తం సంచలనం రేపిన పిల్లాడి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు!
హలో పోలీస్ స్టేషనా? మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చేయండి అంటూ ఓ మహిళ ఫోన్ చేసింది. ముందు ఏమీ అర్థంకాలేదు. తర్వాత వివరాలు తెలియగానే ఉరుకులు, పరుగుల మీద వెళ్లి అతడిని అరెస్టు చేశారు పోలీసులు. అతను తల్లీ, కుమార్తెపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు. అక్టోబర్ 19న నజఫ్‌గఢ్ అనే ప్రాంతంలో ఓ తల్లీకూతురిపై కాల్పులు జరిపాడు ఆమె భర్త. అదే విషయాన్ని పోలీసులకు తెలిపి అరెస్టు చేయాల్సిందిగా కోరింది ఆమె. హుటాహుటిన పోలీసులు అతని ఇంటికి చేరుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ రోజు కర్వాచౌత్ కావడం కూడా మరో విశేషం. భర్త క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ ఉపావాసం కూడా ఉంటారు. ఆ రోజు భర్తను పట్టించిన ఆమెను చూసి స్థానికులు అందరూ ప్రశంసిస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమే అంటూ ఆమె నడుచుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు నా భర్తను చంపొద్దని.. తన క్షేమం కోసం కర్వాచౌత్ ఉపవాసం కూడా ఉన్నానని ఆమె తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
