రోడ్డుపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. గ్రీన్ లైట్ పడింది. ఇక మొదలవుతుంది చెవులు చిల్లులు పడేలా హారన్ మోత. ముందున్న వాహనం కాస్త నెమ్మదిగా కదిలితే చాలు.. మన అసహనాన్ని అంతా హారన్ మీద చూపిస్తాం. మనదేశంలో ఇష్టారాజ్యంగా ఇలా హారన్ మోత మోగిస్తాం.. కానీ విదేశాల్లో మాత్రం ఇలా ఉండదు. హారన్ మోగితే ఫైన్ కట్టాల్సిందే. అయితే తాజాగా మనదేశంలో కూడా ఇలా హారన్ మోగిస్తున్న వారికి పోలీసులు భారీ జరిమానా విధించి షాకిచ్చారు. సుమారు 600 మందికి పైగా ఫైన్ విధించారు. ఈ ఆసక్తికర సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: కచ్చా బాదం పాట వెనుక ఉన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ!
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌండ్ పొల్యూషన్‌ని నివారించేందుకు, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఉద్దేశ్యంతో.. ఇలా యాంటీ హాంకింగ్(హారన్ మోతపై నిషేధం) డ్రైవ్ ప్రారంభిచినట్లు తెలిపారు. అయితే కోల్‌కతాలో గత ఏడాది జూలై నుంచే ఈ యాంటీ హాంకింగ్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జూలై నెలలో ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్ద, ఆసుపత్రుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా కేవలం 12 రోజుల్లోనే 1,264 మంది వాహనదారులకు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యాంటీ పొల్యూషన్ సెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: బాబోయ్.. చేప ధర అంతా! జాలర్లకు పండగే పండగ..!
యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ పోలీసులు రోజుకు సగటున 22 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. చాలామంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా హారన్ మోగిస్తున్నట్లు గమనించిమన్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకు గాను జరిమానా విధిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి హారన్ మోగించే విషయంలో నిబంధలను ఉల్లంఘించినందుకు గాను 615 మంది వాహనదారులకు 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ ట్రాఫిక్ పోలీసుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.