గురువు దైవంతో సమానం అంటారు. విద్యను నేర్పే గురువుని మించిన దైవం కూడా లేదంటారు. కానీ, కొందరు గురువులు మాత్రం ఆ పేరుకే కళంకం తెస్తూ వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నీఛంగా ప్రవర్తించిన వారు లేకపోలేదు. పిల్లలను ఛిత్రహింసలు పెట్టే వాళు కొందరైతే.. లైంగిక దాడులకు పాల్పడిన ప్రబుద్ధులు సైతం ఉన్నారు. తాజాగా ఓ మాస్టారు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థిని అతి దారుణంగా కొట్టాడు. అది కూడా అందరు విద్యార్థులు చూస్తుండగానే ఓ కుర్రాడిని గొంతు పట్టుకుని వెనక్కి నెడుతూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. సదరు మాస్టారు తీరుపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. ఖుజుమా కాలాలోని పాఠశాలలో విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థిపై సందీప్ భారతి అనే మాస్టారు విచక్షణారహితంగా దాడి చేశాడు. పట్టుకుని కిందపడేసి, జుట్టుపట్టుకుని పైకి లేపి కొట్టాడు. గొంతు పట్టుకుని వెనక్కి నెడుతూ అతి దారుణంగా ప్రవర్తించాడు. టీచర్ కొట్టే దెబ్బలకు తాళలేక ఆ విద్యార్థి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేశాడు. టీచర్ కొట్టే దెబ్బలకు ఆ విద్యార్థి నొప్పితో విలవిల్లాడిపోయాడు. అతడిని కిందపడేయగా.. దుస్తులకు మట్టి కూడా అయ్యింది. కిందపడి లేచిన విద్యార్థిని వదలకుండా సందీప్ భారతి మళ్లీ దాడికి దిగాడు. ఈ దాడి ఘటనను కొందరు ఫోన్లో వీడియో తీశారు.
ఆ టీచర్ విద్యార్థిని గొడ్డుని బాదినట్లు బాదుతుంటే అక్కడున్న విద్యార్థులు గానీ, అక్కడున్న మిగతా టీచర్లు గానీ అడ్డుకోకపోవడం గమనార్హం. అడ్డుతగలకపోగా అంతా వేడుక చూసినట్లు చూస్తూ ఉండిపోయారు. ఒక విద్యార్థి అయితే సార్.. సార్.. మీరు దాడి చేయడం ఎవరో వీడియో తీస్తున్నారు అంటూ వెళ్లి చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ వైరల్ వీడియోపై స్పందించిన పోలీసులు ఆ సందీప్ భారతీపై కేసు నమోదు చేశారు. విద్యార్థి తల్లిందండ్రులను సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసలు అతను ఎందుకు దాడి చేశాడు. అందుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
MP: दरिंदा शिक्षक की बेरहमी से छात्र की पिटाई का वीडियो वायरल, रीवा जिले के गुढ़ तहसील क्षेत्र अंतर्गत खजुहा हायर सेकेंडरी विद्यालय का मामला, विद्यालय में कक्षा 8 में अध्ययनरत है छात्र। @KashifKakvi @IG_Rewa @SP_Rewa @CMMadhyaPradesh @KavitaPandeyINC @theobclive @obcricha pic.twitter.com/oWKTbpnrjX
— ओबीसी महासभा मध्यप्रदेश (@OBC_MP) September 29, 2022