Viral Video: జంతువుల మూడ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి సొంత వ్యక్తుల మీద కూడా దాడి చేస్తూ ఉంటాయి. దీనికి ఆ జంతువుల మానసిక స్థితి కారణమవుతూ ఉంటుంది. వాటి మానసిక స్థితులను ప్రభావితం చేసే వాటిలో మనం కూడా ఒకరం. ఒకరకంగా చెప్పాలంటే.. జంతువుల క్రూర ప్రవర్తనకు మనం కూడా కారణం అని చెప్పొచ్చు. అడవిలో పెరిగే మృగాల విషయం పక్కన పెడితే.. జనారణ్యంలో తిరిగే వాటన్నిటి పరిస్థితి ఇదే. తాజాగా, ఓ ఎద్దు తన దారికి అడ్డంగా నిలబడ్డ ఓ పోలీస్ అధికారిని గాల్లోకి ఎత్తి కొట్టింది. ఈ సంఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ సింగ్ ఓ పోలీస్ కానిస్టేబుల్. దయాల్‌పూర్ ఏరియాలోని షేర్‌పుర్ చౌక్‌లో డ్యూటీలో ఉన్నాడు. సాయంత్రం రోడ్డుకు కుడివైపు వచ్చి నిలబడ్డాడు.
ఫోన్ ఆపరేట్ చేస్తూ, చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి వెనకాల కొద్దిదూరంలో ఓ ఎద్దు నడుచుకుంటూ వస్తోంది. దాని దారికి గ్యాన్ సింగ్ అడ్డంగా కనిపించాడు. అంతే! కోపంగా తలతో అతడ్ని గాల్లోకి ఎత్తి కొట్టింది. అతడు గాల్లో గింగిరాలు తిరిగి నేలపై పడ్డాడు. బాధతో గిలగిల్లాడసాగాడు. ఎద్దు మాత్రం తన మానాన అది పక్కకు వెళ్లి నిలబడింది. కానిస్టేబుల్ పరిస్థితి చూసిన మరో కానిస్టేబుల్, మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పెద్దగా గాయాలు కాకపోవటంతో ప్రథమ చికిత్స చేయించి పంపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నూతన వధువరులకు పెట్రోల్, డీజిల్ గిఫ్ట్! వీడియో వైరల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి