ఈ మద్య కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ కొంత మంది ఆకతాయిలు ప్రభుత్వ ఆస్తులైన రైళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాళ్ల దాడులు జరిగాయి.
ఇటీవల దేశంలో ప్రజల ప్రయాణాల సౌకర్యార్థం కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజల సౌకర్యం కోసం తీసుకు వచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఇటీవల కొంత మంది ఆకతాయిలు దాడులకు పాల్పపడ్డారు. తాజాగా చెన్నై-మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. బెంగళూర్ కంటోన్ మెంట్ స్టేషన్ల మద్యలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు డివిజన్ పరిధిలోని మైసూర్-చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్ పై కొంత మంది దుండగులు రాళ్లతో దాడులు చేశారు. కేఆర్ పురం, బెంగళూరు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ ల మధ్య శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్ పై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో రైల్ కోచ్ ల కిటికీలు అద్దాలు ధ్వంసం అయ్యాయని.. కొంతమంది గాయపడ్డట్టు నైరేతి రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కొంతమంది దుండగులు రాళ్లు రువ్వడం ఇదేం కొత్త కాదుక.. గతంలో ఇదే రైలు పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడులు చేశారు. ఆ మద్య విశాఖ-సికింద్రబాబ్ మద్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పై ఆకతాయిలు రాళ్లు రువ్వారు. ప్రజల ప్రయాణాలు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల మధ్య రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతున్నప్పటికీ కొన్నిచోట్ల వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లదాడులకు పాల్పపడుతున్నారు.
ఇప్పటికీ పలుమార్లు అవగాహన డ్రైవ్ లు, కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కొంత మంది ఆకతాయిలు, దుండగులు రెచ్చిపోతూ దాడులకు పాల్పపడుతున్నారని.. కదులుతున్న రైళ్లతో సహా పబ్లిక్ ఆస్తులకు నష్టం కలగజేస్తే.. రైల్వే చట్టం లోని సెక్షన్ 5 ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరుగుతుందని.. అధికారి తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.