సాధారణంగా కోడి.. రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది.. ఒకటి లేదా రెండు. అంతకుమించి గుడ్లు పెట్టడం జరగదు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కోడి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ కోడి.. 12 గంటల వ్యవధిలో ఏకంగా 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. ఈ విషయం తెలిసి సామాన్యులే కాక.. పశుసంవర్థక శాఖ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆఫ్ డేలో 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించిన ఈ కోడి గురించి పూర్తి వివరాలు..
ఈ వింత సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. అల్మోరా జిల్లా.. బాసోత్ గ్రామంలో నివాసం ఉటున్న గిరీశ్ చంద్ర బుధాని.. టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పని చేస్తున్నాడు. అతడి దగ్గర ఓ కోడి ఉంది. ఇటీవల రోజుకు రెండు గుడ్లు పెట్టసాగింది. సర్లే.. ఇది సాధారణ విషయమే అనుకున్నారు. కానీ డిసెంబర్ 25న కోడి వరుసగా గుడ్లు పెడుతూనే ఉంది. సాయంత్రి.. ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న గిరీశ్ ఆశ్చర్యపోయాడు. అతడు వచ్చాక కూడా కోడి గుడ్లు పెడుతూనే ఉంది. అలా రాత్రి 10 గంటల వరకు ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఈ విషయం తెలిసి స్థానికులు ఈ వింత చూడ్డానికి గిరీశ్ ఇంటికి క్యూ కట్టారు.
ఈ సందర్భంగా గిరీశ్ మాట్లాడుతూ.. ఈ కోడికి రోజూ 200గ్రాముల వేరు శనగ గింజలు మేతగా వేస్తాం. అలానే వెల్లుల్లీని కూడా పెడతాను. రోజు ఒక్క గుడ్డు పెట్టేది. కానీ కొన్ని రోజులగా 2 గుడ్లు పెడుతుంది. కానీ డిసెంబర్ 25న మాత్రం ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ అధికారులు కోడిని పరిశీలించేందుకు గిరీశ్ ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీనిపై స్టడీ చేస్తామని తెలిపారు. మరి ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.