పోలీసులు అంటే ఎవరికైనా ఒక రకమైన భయం ఉంటుంది.. ఫ్రెండ్లీ పోలీస్ అని చెబుతున్నప్పటికీ పోలీసులు కర్కశ హృదయం కలిగి ఉంటారని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. కానీ పోలీసులు ఎన్నో సార్లు తమ మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఉన్నాయి.
సాధారణంగా పోలీసులు కర్కశ హృదయం కలిగి ఉంటారని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. సామాన్య ప్రజలకు ఖాకీ దుస్తులు చూస్తేనే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీస్ అని చెబుతున్నా.. జనాలకు మాత్రం భయంతోనే ఉంటారు. కొన్నిసార్లు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా జంకుతుంటారు. వృత్తిరిత్యా మాత్రమే పోలీసులు కఠినంగా ఉంటారు.. వాళ్లకూ మంచి మనసు ఉంటుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా తీవ్రంగా గాయపడ్డ ఓ కూలీకి పోలీస్ నోట్లో గాలి ఊదుతూ, ఛాతీపై నొక్కి సీపీఆర్ చేసి హార్ట్ బీట్ పని చేసేలా చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వారణాసి చేత్ గంజ్ ప్రాంతంలో పాతకాలం నాటి భవనం కూల్చివేసే పనిలో ఉన్నారు. అనుకోకుండా అక్కడ గోడ కూలి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. అందులో ఓ వ్యక్తి స్పాట్ లోనే చనిపోగా.. మరో వ్యక్తి ఊపిరి ఆడక విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై అనంత్ మిశ్రా, శశి ప్రతాప్ అక్కడికి చేరుకున్నారు. కూలీ పరిస్థితి చూసి వెంటనే అతని నోట్లోకి గాలి ఊదుతూ.. ఛాతిపై నొక్కుతూ ఊపిరి ఆడే విధంగా అతనికి సీపీఆర్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ కూలీకి గుండె కొట్టుకోవం మొదలైంది. పోలీస్ సమయస్పూర్తితో ప్రదర్శించి అపాయంలో ఉన్న కూలీకి సీపీఆర్ చేసి ఆక్సీజన్ అందించి ఊపిరిపోశాడు. ఎస్ ఐ కూలీ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీస్ ఊపిరి పోసిన కూలీ హాస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
కళ్ల ముందు చావు బతుకుల్లో ఉంటే చాలా మంది చూసీ చూడకుండా వెళ్లిపోతున్న రోజులు ఇవి. వారణాసిలో చేత్ గంజ్ వద్ద ఒక కాలనీలో ఇంటి నిర్మాణం జరగుతుంది. శిథిలావస్థలో ఉన్న ఓ గొడ కూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న చెట్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనంత్ మిశ్రా, శశి ప్రీతమ్ ఇద్దరు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ కూలీకి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇదంతా అక్కడ ఉన్న స్థానికులు తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నోటితో కూలీకి శ్వాస అందించిన కాపాడేందుకు పోలీసులు చూపిన చొరను ప్రజలు హర్షిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.