ఓ జైలులో ఒక ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి చికిత్స చేయించడం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కానీ అతడు మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఎన్‌కౌంటర్ చేయబోమని రాసిస్తేనే ఆస్పత్రి లోపలికి వస్తానంటూ మంకుపట్టు పట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఎన్‌కౌంటర్ అంటే తెలిసిందే. తమపై ఎవరైనా దాడికి దిగితే పోలీసులు, సైనికులు ఎదురుకాల్పులకు దిగుతుంటారు. ఎన్కౌంటర్లు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులను పట్టుకునే సమయంలో వాళ్లు దాడులకు దిగితే.. భద్రతా దళాలు తమ రక్షణ కోసం ఎదురు కాల్పులకు దిగుతాయి. ఇక.. పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్కౌంటర్స్ జరిగాయనే వార్తలూ టీవీలు, పత్రికల్లో చూస్తున్నాం. అయితే కొన్నిసార్లు పోలీసులకు నేరస్థులకు మధ్య కూడా ఎదురు కాల్పులు జరుగుతాయి. ఖైదీలను కోర్టులకు తరలించే టైమ్‌లోనూ ఎన్కౌంటర్లు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇదిలాఉండగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో నేరస్థులు.. పోలీసులు అంటేనే భయపడిపోతున్నారు.
పోలీసులు తమను ఎక్కడ ఎన్ కౌంటర్ చేసేస్తారేమోనని వణికిపోతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఓ ఘటన యూపీలోని హర్దోయి నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రిజ్వాన్ అనే ఖైదీని పోలీసులు జిల్లా జైలు నుంచి డయాలసిస్ చేయించడం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఖైదీ మాత్రం వైద్యానికి నిరాకరించాడు. హాస్పిటల్‌కు చేరిన తర్వాత ఎన్‌కౌంటర్ చేయబోనని రాసిస్తేనే తాను డయాలసిస్ చేయించుకుంటాను అని ఆ ఖైదీ ఒకటే మంకుపట్టు పట్టాడు. ఎన్‌కౌంటర్ చేయబోమని పోలీసులు ఎంత చెప్పినా అతడు వినలేదు. తనకు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నమ్ముతానని రిజ్వాన్ పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
आरोपी को एनकांउटर का खौफ, हरदोई की जेल में बंद कैदी रिजवान नज्म ने बीच सड़क पर किया जमकर हंगामा और कहा – लिख कर दो रास्ते में गोली तो नहीं मरोगे !
.
.
Follow Us On 👉👉👉 @inhnewsindia
.
.#uttarpradesh #hardoi #police #encounter #Jail #prisoner #RizwanNazm #goli #yogiadityanath pic.twitter.com/41msfkUlMd— INH 24X7 (@inhnewsindia) March 14, 2023