జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేస్తే నేరం కదా అని అనుకోవచ్చు. అయితే అది రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనంత వరకూ. ఎప్పుడైతే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందో.. ఇక జనరల్ టికెట్ తో స్లీపర్ కోచెస్ లో కూడా ప్రయాణం చేయవచ్చు. అదేంటి బోలెడంత డబ్బు కట్టి స్లీపర్ కోచెస్ లో ప్రయాణం చేసే వారితో కలిసి.. జనరల్ టికెట్ మీద ప్రయాణం చేసే వారు ప్రయాణం చేస్తే తప్పు కదా. ఇది న్యాయం కాదు కదా బ్రో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క ఖాళీ బెర్తులతో, మరోపక్క జనరల్ కోచెస్ లో సీట్లు లేక ఇబ్బంది పడుతున్న జనాలతో రైలు వెళ్తుంటే.. అది ఎంత అన్యాయమో ఆలోచించండి. స్లీపర్ కోచెస్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయి, జనరల్ కోచ్ లో ఉన్న వారిని స్లీపర్ కోచెస్ లో అనుమతిస్తే బాగుంటుందని అనిపించే ఉంటుంది.
సరిగ్గా ఇదే ఆలోచన రైల్వే వారికి వచ్చింది. జనరల్ టికెట్ తో రైల్లో ప్రయాణం చేసే వారు చాలా మంది ఉంటారు. అందుకే రైళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దీంతో చాలా మంది నిలబడి ప్రయాణం చేస్తుంటారు. గంటలు గంటలు నిలబడి ప్రయాణం చేస్తారు. అయితే కొంతమందికైనా ఉపశమనం కల్గించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తో ఖాళీగా ఉన్న స్లీపర్ కోచెస్ లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ప్రయాణం చేసేలా సదుపాయం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే రైళ్లలో స్లీపర్ కోచెస్ లో జనరల్ టికెట్ తో ప్రయాణం చేసేలా రైల్వే శాఖ కార్యాచరణ రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది.
చలికాలం కారణంగా చాలా మంది స్లీపర్ కోచెస్ లో ప్రయాణం కంటే ఏసీ కోచెస్ లో ప్రయాణం చేయడానికే ఇష్టపడుతున్నారు. ఏసీ కోచ్ లు బయట చలి గాలి లోపలకు రాకుండా ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేస్తుంటాయి. ఈ కారణంగా ఎక్కువ మంది ఏసీ కోచుల్లో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీని వల్ల స్లీపర్ కోచుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఆ ఖాళీలను జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులతో ఫిల్ చేస్తే.. ఉపశమనం దొరుకుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. చలికాలంలో స్లీపర్ కోచుల్లో సీట్లు 80 శాతం ఖాళీగా ఉంటున్నాయి. అందుకే రైల్వే శాఖ ఈ ఖాళీ సీట్లను జనరల్ సీట్లుగా తాత్కాలికంగా కన్వర్ట్ చేయాలని భావిస్తుంది.
దీనిపై రైల్వే శాఖ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటనం ఇవ్వలేదు. కానీ జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ సదుపాయాన్ని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తుందో చూడాలి. అయితే కేవలం చలికాలంలోనే ఉంటుందా? మిగతా కాలాల్లో కూడా ఇంత కాకపోయినా.. కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా ప్రయాణం చేసే అవకాశం ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. మరి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రయాణికులకు ఉపశమనం దొరికినట్టే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.