మనదేశం ఎన్నో చారిత్ర కట్టడాలకు నిలయం. ఇక్కడ వందల, వేల సంవత్సరాల నాటి కట్టడాలు మనకు దర్శనం ఇస్తుంటాయి. అలానే మారుమూల గ్రామాల్లో సైతం వేల ఏళ్ల నాటి ఆలయలు మనకు దర్శనం ఇస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఈ ఆలయాలను, ఇతర చారిత్ర కట్టడాలను కాపాడుకునేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. అందుకే ఎన్నో పురాతన కట్టడాలు, ఆలయాలు నేటికి మనకు దర్శనం ఇస్తున్నాయి. అలానే తాజాగా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఓ హనుమాన్ ఆలయం ఉంది. మాములుగా అయితే కొత్త గుడి పక్కన కట్టించవచ్చు. కానీ అది వంద ఏళ్ల నాటి ఆలయం కావడంతో.. చారిత్ర గుర్తుగా ఉంచాలని ఆప్రాంతం వాళ్లు, అధికారులు భావించారు. ఇక వెంటనే ఆలయాన్ని 250 జాకీలతో 67 అడుగులు వెనక్కి జరిపేందుకు చర్యలు చేపట్టారు. మరి.. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ జిల్లాలోనే కచియాని ఖేడా ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆ గ్రామం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని 5 చదరపు మీటర్ల విస్తీర్ణం, 64 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో హనుమాన్ ఆలయం ఉంది. రహదారి విస్తరణ పనులు చేపట్టగా ఈ ఆలయం అడొచ్చింది. మొదట పక్కనే కొత్త గుడి కట్టించాలని అధికారులు భావించారు. అయితే ఆ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్న విషయం తెలుసుకుని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆలయానికి ఎటువంటి నష్టం జరగకుండా 67 అడుగులు వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నారు. గుడిని 250 జాకీలతో ఎత్తు పెంచి ఎనిమిది అడుగుల మేర ఆలయాన్ని వెనక్కి జరిపారు. ఆలయం పూర్తిస్థాయిలో అనుకున్న ప్రాంతాన్నికి చేర్చాడానికి మరో నెల రోజులు పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ ఆంజనేయుడి గుడిని కొత్త స్థలంలోకి చేర్చే విషయంలో కూడా కొంత వివాదం జరిగింది. ఆ గుడిని ఉంచాలనుకున్న ప్రదేశం..బాబు అలీ అనే ముస్లి వ్యక్తిది. ఆయన కొంత భూమిని ఇవ్వడంతో గుడికి అడ్డంకి తొలగిపోయింది. తనకున్న కొంత భూమిని బాబు అలీ బైనామా చేశారని, అందులో కొనుగోలుదారుగా సంతకం చేయడంతో ఆ స్థలంలోకి హనుమాన్ ఆలయాన్ని తరలిస్తున్నట్టు డిప్యూటీ కలెక్టర్ కృష్ణ తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు బాబు అలీ ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు. యూపీలో మొదటిసారి ఈ సాంకేతికను ఉపయోగించామని అధికారులు పేర్కొన్నారు. జాతీయ రహదారి అథారిటీ అధికారులు, పోలీసులు సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయని డిప్యూటీ కలెక్టర్ కృష్ణ చెప్పారు. మరి.. ఇలా పురాతన కట్టడాల విషయంలో అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై మీ అభిప్రాయను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.