మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నరంలేని నాలుక మాట్లాడే మాటలకు శరీరం బాధపడుతుంది. ముఖ్యంగా ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో వారి నోటి నుంచి వచ్చే ఆనాలోచిత వ్యాఖ్యలు చిక్కుల్లో పడేస్తాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే తాజాగా ఓ మహిళ ఐఏఎస్ అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటుంది. ‘ఉచితంగా ఇస్తే చివరకు కండోములు కూడా కావాలంటారు’.. అంటూ ఆ మహిళ ఐఏఎస్ అధికారి అన్నారు. అది కూడా విద్యార్ధినులతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలకు అక్కడి విద్యార్ధినులు బిత్తరపోయారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లోని పాట్నాలో విద్యార్ధులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి బిహార్ ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్ జోత్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలు విద్యార్ధినిలతో షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతుండగా.. ఓ విద్యార్ధిని కల్పించుకుని ప్రభుత్వం ప్రజలకు అనేకం ఉచితంగా అందింస్తోందని, విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు , సైకిళ్లు వంటివి కూడా ఇస్తోందని, అయితే వారి కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం..రూ.20-30 విలువ చేసే శానిటరీ నాప్ కిన్స్ ను ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు సదరు మహిళ అధికారి స్పందిస్తూ.. ‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈ రోజు శానిటరీ నాప్ కిన్స్ ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకోస్తే కండోములు కూడా ఉచింతంగా అడుగదుతారు’ అంటు సమాధానం ఇచ్చింది. దీనికి విద్యార్ధినులు కూడా వెనక్కు తగ్గలేదు. ‘ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా?’ అంటూ నిలదీశారు. దీంతో హర్ జోత్ కౌర్ మాట్లాడుతూ.. ‘అయితే ఓట్లు వేయకండి. పాకిస్థాన్ లా మారిపోండి’ అంటూ విద్యార్ధులపై మండిపడ్డారు. అయితే ఆమె వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. హర్ జోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్నాయి.
A simple request for good quality sanitary pads (costing Rs 20-30) was met with a snarky response from Bihar’s IAS officer Harjot Kaur.
“Tomorrow you’ll say the Govt can give jeans too. And why not some beautiful shoes after that… family planning method, nirodh too.” pic.twitter.com/b98VWA3b8H
— Marya Shakil (@maryashakil) September 28, 2022