సంసారం అనే సాగరంలో అలలు అనే గొడవలు వస్తూపోతూ ఉంటాయి. భార్యను అనేక రకాల వేధింపులకు భర్త గురి చేస్తుంటాడని చాలా మంది భావిస్తుంటారు. అది నాణేంకి ఒకవైపు మాత్రమే.. మరోవైపు భర్తలు కూడా ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. ఆడవారు చెప్పుకున్నట్లు బయట ప్రపంచానికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన బాధను బయట ప్రపంచానికి వినూత్నంగా తెలియజేశాడు.
సాధారణంగా భార్యాభర్తల బంధంలో గొడవలు అనేవి వస్తునే ఉంటాయి. అలానే భార్యను అనేక రకాల వేధింపులకు భర్త గురి చేస్తుంటాడని ఎక్కువ మంది భావిస్తుంటారు. అది నాణేంకి ఒకవైపు మాత్రమే.. మరోవైపు భర్తలు కూడా ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. ఆడవారు చెప్పుకున్నట్లు బయట ప్రపంచానికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతుంటారు. మరి కొందరు మాత్రం భార్య, ఆమె తరుపు వాళ్లు పెట్టే హింసలను వినూత్నంగా బయటి ప్రపంచానికి తెలియజేస్తుంటారు. తాజాగా బీహార్ కు చెందిన ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు. హర్యానాలో ని ఫరీదాబాద్ రోడ్లపై ‘కిడ్నీ అమ్మడానికి సిద్ధంగా ఉంది’, ‘మార్చి 21 ఆత్మహత్య కార్యక్రమం’ అంటూ ప్లెక్సీ పట్టుకుని రోడుపై నిల్చున్నాడు. మరి.. అతడు అలా చేయడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన సంజీవ్ కు ఆరేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఎంతో సంతోషంగా, సుఖంగా సంజీవ్ పెరిగాడు. అయితే పెళ్లి తరువాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య, బావమరిది, అత్తమామల నుంచి తీవ్ర స్థాయిలో వేధింపులు వచ్చాయి. చివరకు భార్యకు విడాకులు ఇవ్వాలని భావించాడు. అయితే విడాకులు కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని సంజీవ్ భార్య డిమాండ్ చేస్తోంది.
ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పి బాధపడ్డాడు. తన బాధను చెప్పుకుని, న్యాయం చేయాల్సిందిగా పోలీసులు, అధికారులను అనేక వేడుకున్నాడు. వారిని చాలా సార్లు సంప్రదించిన తర్వాతే విసిగిపోయి ఇలా ప్లకార్ట్ పట్టుకుని తిరుగుతున్నానని సంజీవ్ అన్నారు. మార్చి 21లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని, ఒకవేళ అమ్మలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అతడు పేర్కొన్నాడు. హర్యానాలోని ఫిరీదాబాద్ లో రోడ్లపై బ్యానర్ పట్టుకుని తనకు సాయం చేయాలని అందరిని ప్రాధేయపడుతున్నాడు.
21న పాట్నాలో జరిగే తన ఆత్మహుతి కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహర్ సీఎం నీతీశ్ కుమార్ ల పేర్లను సైతం ఆ ప్లకార్ట్ లో ఒకవైపు ముద్రించాడు. మరోకవైపు.. భార్య, బావమరిది, వారి బంధువుల ఫోటోలను సైతం ముద్రించాడు. వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు ఎంతో వేదనకు గురవుతూనే ఇలా రోడ్డుపైకి వచ్చి ఉంటాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.