నేటికాలంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయడం అంటే తలకు మించిన భారంలా భావిస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఆడ పిల్లల తల్లిదండ్రుల కోరికలకు అబ్బాయిల తల్లిదండ్రులు విలవిలాడుతున్నారు. మంచి ఉద్యోగం ఉన్న వాడి పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక ఏ ఉద్యోగం లేని యువకుల గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ.. తమ సంస్థలోని పెళ్లి కాని ఉద్యోగులకు తీపికబురు అందించింది. మరి ఆ శుభవార్త ఏమిటనే కదా మీ సందేహం. అయితే పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
తమిళనాడులోని మధురైలో ఉన్న శ్రీ మూకాంబికా ఇన్ఫోసోల్యుషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపింది. అదే విధంగా తమ సంస్థలో పనిచేస్తున్న పెళ్లి కాని ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. వారికి పెళ్లి సంబంధాలు చూడటానికి కంపెనీలో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని సదరు కంపెనీ తెలిపింది.ఇదే సమయంలో పెళ్లికి కుదిరితే అప్పుడు ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆ కంపెనీ సీఈవో సెల్వగణేష్ తెలిపారు. తమ సంస్థ 2006 లో శివకాశిలో ప్రారంభమై.. క్రమంగా అభివృద్ధి చెంది..2010లో మధురైకి మార్చబడింది.
ప్రస్తుతం వందల మంది ఉద్యోగులతో సంస్థ అభివృద్ధిలో ఉందని ఆ కంపెనీ సీఈవో తెలిపారు. కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని సెల్వగణేష్ తెలిపారు.ఇలాంటి ఆఫర్ ప్రకటించడం వలన ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారాలన్న ఆలోచనలను మానుకొంటారు. సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లు ఇంక్రిమెంట్స్ ఇస్తున్నామని , తమ కంపెనీలో చేరిన ఉద్యోగికి మొదటి రోజు నుంచే ఫిక్స్ డ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని సీఈవో సెల్వగణేష్ తెలిపారు. మరి.. పెళ్లి కానీ వారి కోసం సంబంధాలు చూస్తామని ముందుకు వచ్చిన ఈ కంపెనీ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.