స్కూళ్ల మూసివేతపై తాజాగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ నెల 3 తేదీ నుంచి పూర్తిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు తాజాగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు తెరుస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేమని తెలిపారు.
అయితే సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం ఇంకా తగ్గడం లేదని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నించింది. ఇక ఇదే కాకుండా ఉద్యోగులకు వర్క ఫ్రమ్ ఇచ్చినప్పుడు స్కూల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వాయి కాలుష్య నివారణ దిశగా అడుగులు వేస్తున్నామని, పాఠశాలలు కూడా మూసివేశామంటూ కోర్టుకు వివరించే ప్రయత్నం చేసింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ప్రస్తుతం గాలి నాణ్యతలో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది వాయి కాలుష్యం పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కాగా ఢిల్లీలోని లోధి రోడ్ ప్రాంతంలో గురువారం నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 339 వద్ద ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయి కాలుష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.