గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరులో పండుగవేళ ఘోరం జరిగింది. జవధుమలై ప్రాంతంలో ఓ మినీ వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు.
వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతి వేగంగా వ్యాన్ నడుపుతూ కరెంట్ స్తంభానికి ఢీ కొట్టడంతో వ్యాన్ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు చిక్కుకోగా వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.