వారంలోని మొత్తం టైమ్‌లో మార్పులు లేకుండా ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల్లో రోజు 12 గంటల పాటు పనిచేసేలా ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఉద్యోగుల పనివేళల విషయంలో ఒక్కో చోట ఒక్కోలా నియమాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రోజుకు 8 గంటల పనివేళలు ఉంటే మరోచోట రోజుకు 9 గంటలు ఉన్నాయి. ఆయా రంగాలను బట్టి కూడా పనివేళల్లో తేడాలు ఉంటాయి. అయితే పని ఒత్తిడిని తగ్గించేందుకు, కుటుంబాలతో ఉద్యోగులు సమయం గడిపేందుకు గానూ వర్కింగ్ అవర్స్‌ను తగ్గించాలని డిమాండ్లు వస్తుండటం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. వారానిరి రెండు వీక్ ఆఫ్స్ ఇవ్వాలని చాలా రంగాల్లో ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరైనా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వారంలోని మొత్తం సమయంలో ఏమాత్రం మార్పులేకుండా ప్రైవేటు కంపెనీలు, ఇండస్ట్రీలలో రోజూ 12 గంటలపాటు పనిచేసేలా ఒక బిల్లును ప్రవేశపెట్టింది అధికార డీఎంకే పార్టీ.
డీఎంకే ప్రవేశపెట్టిన ఈ కొత్త పనివేళల బిల్లుపై ప్రతిపక్షాలు సహా అధికార పార్టీ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెల్లుబికింది. అయితే నిరసనలు, వ్యతిరేకత మధ్యే మూజువాణి విధానంలో బిల్లు నెరవేరింది. ఇది కంపెనీల యాజమాన్యానికి అనుకూలమైన బిల్లుగా ఉందని సిందనై సెల్వన్ (వీసీకే) ఆరోపించారు. శ్రమదోపిడీకి ఇది బాటలు వేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రాష్ట్ర సర్కారు ఈ బిల్లు నెరవేర్చిందని సీపీఎం నేత నాగై మాలి ఆరోపించారు. కార్మికుల హక్కులను ఈ చట్టం కాలరాస్తుందన్నారు. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు తమిళనాడుకు తరలి వస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు పనివేళల్లో వెసులుబాటు కోరుతున్నాయని తంగం తెన్నరసు పేర్కొన్నారు. వాటి కోసమే ఈ చట్టమని తెలిపారు. ఏ రంగాల కార్మికులకు ఈ బిల్లు వర్తిస్తుందనే విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందని తెన్నరసు పేర్కొన్నారు. ఎవరైతే ఈ విధానానికి సుముఖంగా ఉంటారో ఆ కార్మికులు మాత్రమే పాటించే హక్కు కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. 12 గంటల పనికి తగిన విధంగా కార్మికులకు వసతులను కల్పించే సంస్థలు, పరిశ్రమలకే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రి సీవీ గణేశన్ స్పందిస్తూ.. ఈ బిల్లు వల్ల వారం మొత్తం పనివేళల్లో మార్పు ఉండదన్నారు. 4 రోజులు పనిచేసి మిగతా మూడ్రోజులు విశ్రాంతి తీసుకోవచ్చని ఆయన తెలిపారు.
This Bill = naked labour exploitation.
In 2020, opposition leader Stalin said, “TN govt must not ‘copy’ what Union & BJP govts are doing. Union labour ministry must immediately withdraw a circular which increased working hours from eight to 12 each day”https://t.co/X8MaxnN0NC
— Meena Kandasamy (@meenakandasamy) April 21, 2023