ఎన్నో ఆశలతో కళాశాలలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు.. ర్యాగింగ్ ఓ భూతంలా మారిపోయింది. విద్యా బుద్ధులు నేర్పాల్పిన విద్యాలయాలే ర్యాగింగ్ అడ్డాలుగా మారిపోతున్నాయి. తాజాగా మరో సారి రాకాసి ర్యాగింగ్ కలకలం రేపింది.
మానవ జీవితంలో అందమైన దశ బాల్యం, విద్యార్థి దశ. సంతోషకరమైన జీవితం గడపాలన్నా, లక్ష్యాలు సాధించాలన్నా ఈ దశలోనే. పాఠశాల చదువుల తరువాత ఎన్నో ఆశలతో కళాశాలలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు.. ర్యాగింగ్ ఓ భూతంలా మారిపోయింది. విద్యా బుద్ధులు నేర్పాల్పిన విద్యాలయాలే ర్యాగింగ్ అడ్డాలుగా మారిపోతున్నాయి. జూనియర్లను ఏడిపించే క్రమంలో సీనియర్లు పిచ్చి పిచ్చి చేష్టలకు ఒడిగడుతున్నారు. దీంతో అమాయకమైన విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. లేదంటే ఈ ర్యాగింగ్‌ను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో సారి రాకాసి ర్యాగింగ్ కలకలం రేపింది.
తమిళనాడులో ర్యాంగింగ్ ఘటన కలకలం సృష్టించింది. చెయ్యార్ లోని అరిగ్నార్ అన్నా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీకి చెందిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధిస్తున్న వీడియో క్లిప్ ఒకటి బటయకు వచ్చింది. కాలేజీలోని ఆది ద్రావిడ హాస్టల్‌లో ఈ ర్యాగింగ్ జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టారు. దీనికి కారణమైన ఎనిమిది మంది సీనియర్లను కళాశాల అధికారులు నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. మొదటి ఏడాది విద్యార్థులను అత్యంత ఘోరంగా పనులకు వినియోగించుకుంటున్నారు. సీనియర్లు తమను బానిసల్లా చూస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
జూనియర్స్‌తో బట్టలు ఉతికించడం, రికార్డ్స్ రాయించడం, చదువుకుంటున్న వాళ్లను డిస్టర్బ్ చేయడం చేస్తున్నారు. పరీక్షలు ఉన్నా చదువుకోనివ్వకపోవడం వంటి చర్యలకు దిగారు. వీరిని వ్యతిరేకిస్తే, అందరి ముందు బట్టలు ఊడదీసి, కొరడాతో కొడుతున్నారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్‌కు కంప్లైంట్ చేయగా.. ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులపై యాక్షన్ తీసుకున్నారు. వాళ్లపై నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఇక మీదట జరగకుండా తీసుకునేలా చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. చెయ్యార్ పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.