చదువుకోవాల్సిన వయసులో కొంతమంది యువతీ, యువకులు బరితెగిస్తున్నారు. దేవాలయం లాంటి విద్యాలయంలో పాడు పనులకు పాల్పడుతున్నారు. తాజా ఘటనలో ఓ యువతి, యువకుడు కాలేజ్‌లోనే సరసాలకు దిగారు. అది కూడా మాజీ సీఎం కార్యక్రమం జరుగుతూ ఉండగా. ఈ సంఘటన కర్ణాటకలోని చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్తాంగడిలోని గురుదేవ కాలేజ్లో కొద్దిరోజుల క్రితం ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి రాకతో కాలేజ్‌లో సందడి నెలకొంది. ఓ వైపు బ్రహ్మాండంగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉండగా.. మరో వైపు ఓ ఘోర కలి చోటుచేసుకుంది. అందరూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో బిజీగా ఉండగా.. ఓ యువతీ, యువకుడి జంట పాడు పనికి తెరతీసింది. ఆ జంట సరసాల్లో మునిగిపోయింది. కౌగిలింతలు, ముద్దులతో రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు కాలేజ్ యజమాన్యం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆ ఇద్దరు యువతీ, యువకులను కాలేజ్ సస్పెండ్ చేసింది.
మొదట సదరు యువతిని మాత్రమే సస్పెండ్ చేశారన్న ప్రచారం జరిగింది. కానీ, ఇద్దర్నీ సస్పెండ్ చేసినట్లు తర్వాత తేలింది. ప్రస్తుతం ఈ వార్త కాలేజ్‌లో తప్పుడు పనులు చేసే యువతీ, యువకులకు గొడ్డలి పెట్టుగా మారింది. కాలేజ్ యజమాన్యం తీసుకున్న నిర్ణయానికి జనం జేజేలు కొడుతున్నారు. తప్పుడు పనులు చేసే వారికి ఇలాగే బుద్ధి చెప్పాలంటున్నారు. మరి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ముఖ్య అతిధిగా హాజరైన కార్యక్రమంలో ఓ యువతీ, యువకుల జంట ఇలా తప్పుడు పనులు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.