ఇటీవల కాలంలో గుండె పోటుతో సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా దాదాపు యువకుల్లో కూడా ఈ హార్ట్ ఎటాక్ వస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఇతర పనుల కారణంగా ఈ గుండె సంబంధిత సమస్యలు సంభవిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ గుండె పోటు అనేది వస్తుంది. ఒకప్పుడు అర్ధ శతాబ్ధం పైబడిన వయస్సు వారికి గుండె పోటు వచ్చేది. ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు లేని వారికి ఈ గుండెపోటు వస్తుంది. ఇంకా దారుణం ఏమిటంటే.. ఎప్పుడు, ఏ సమయంలో ఈ గుండెపోటు వస్తుందో ఎవ్వరం చెప్పలేము.. అప్పటి వరకు ఎంతో బాగా కనిపించే మనిషి.. ఈ హార్ట్ ఎటాక్ తో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఓ వీడియో చూస్తే నిజమే అనక మానరు. ఓ వ్యక్తి భోజనం చేస్తూనే గుండె పోటు కారణంగా కుప్పకూలి మృతిచెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని ఓ టోల్ ప్లాజా వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. మృతుడు కొంతకాలం నుంచి టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ తమకు కేటాయించిన గదిలో మధ్యాహ్నం సమయంలో భోజనాలు చేస్తుంటారు. అలానే సదరు వ్యక్తి కూడా తాను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ను తీసుకుని ఆ గదిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అంతే అలా గుండెపై చేతితో గట్టిగా పట్టుకుని అలానే బెంచిపై నుంచి కుప్పకూలిపోయాడు. అలా బెంచ్ పై నుంచి వెనుకకు పడిపోయిన సదరు వ్యక్తి వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ పుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరణం ఇంత అకస్మాత్తుగా వస్తుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అన్ని వయస్సుల వారికి మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు అనేది సర్వసాధారణంగా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. శనివారం టాలీవుడు నటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా 23 రోజులు చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ, రాజకీయ పరిశ్రమలో విషాదం నిండుకుంది. రోజు రోజుకూ గుండెకు సంబంధించిన కేసులు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు అంటున్నారు. టోల్ ప్లాజ్ సెక్యూరిటి గార్డు గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
मध्य प्रदेश के सागर में टोल नाके पर खाना खा रहे गार्ड की हार्ट अटैक से मौत #mp #sagar #tollplaza #guard #video #heartattack #Live #मध्यप्रदेश #सागर pic.twitter.com/Fl5Qm67O74
— Pradeep Sharma (प्रदीप शर्मा) (@PradeepSharma_9) February 18, 2023