మనిషి తన కష్టాన్ని ఇతరులకు చెప్పుకునేందుకు, ఆపద వస్తే కాపాడమని అడిగేందుకు దేవుడు నోరు ఇచ్చాడు. ఇక నోరు లేని మూగ జీవాల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్వయం కృషితో ఆపద నుంచి బయిటకి రావడం లేదా బలైపోవడం జరుగుతుంది. జీవాలకు కూడా ఆపదలో తమను తాము కాపాడుకునేందుకు దేవుడు ప్రత్యేక శక్తి ఇచ్చాడు. అందుకే నదుల్లో, వాగుల్లో చెరువులో పడిపోయినప్పుడు మూగజీవాలు ఈదుతుంటాయి. అలా ఎన్నో ప్రమాదాల నుంచి పలు జీవాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జంతువు ప్రాణాలతో బయటపడిన విధానం తెలిస్తే మీ ఆశ్చర్యపోతారు. అనుకోకుండా నదిలో పడిపోయిన పెద్దపులి.. దాదాపు 10 గంటల పాటు శ్రమించి 120 కి.మి దూరంలో నదిలో ఈదుతూ ఓ దీవికి చేరి ప్రాణాలు కాపాడుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అస్సాం రాష్ట్రం ఒరంగ్ పార్క్ వన్యప్రాణాలుకు ప్రసిద్ధి. ఇక్కడ బెంగాల్ టైగర్, పెద్దపులితో సహా అనేక రకల వన్యమృగాలు ఉంటాయి. ఈ పార్క్ సమీపంలోనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు పలు మూగజీవాలు నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోతుంటాయి. అలానే ఓ బెంగాల్ టైగర్ కూడా ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడిపోయింది. ఒరంగ్ పార్క్ నుంచి గౌహతి దగ్గర్లోని ఓ చిన్న దీవికి ఈ బెంగాల్ టైగర్ చేరుకుంది. అయితే పులి నదిలో సాగించిన ప్రయాణం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసేంది. నదిలో పడిపోయిన పెద్దపులి 10 గంటల పాటు ఈదుతూ 120 కిలో మీటర్లు ప్రయాణించింది. మంగళవారం ఉదయం నదిలో ఈత కొడుతున్న పులిని చూసిన స్థానికులు వీడియో తీశారు. దీవి ఒడ్డుకు చేరుకున్నాక బండ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో స్థానికులు గమనించి.. అటవీ శాఖ అధికారులకి సమాచారం అందించారు.
దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పులిని పట్టుకుని గౌహతిలోని పార్క్‌కు అధికారులు తరలించారు. ఈ ఘటనపై అటవీ అధికారులు పలు విషయాలను వెల్లడించారు. ఒరంగ్ పార్క్ నుంచే పులి వచ్చిందని, బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన పులిని జాగ్రత్తగా బయటకు తీశామని అధికారులు తెలిపారు. బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోనే ఒరంగ్పార్క్ ఉందని, నీళ్లు తాగేందుకు పులులు తరచూ నదీతీరానికి వెళ్తాయని, అలానే వెళ్లి ఈ పులి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. మరీ.. 10 గంటల పాటు 120 కిలో మీటర్ల నదిలో ఈదుతూ బయటకు వచ్చిన ఈ బెంగాల్ టైగర్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.