ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేం.. అందుకే అపాయాలు చెప్పిరావని అంటుంటారు పెద్దలు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్ర ఘటనలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. వాటిల్లో కొన్ని మనసారా నవ్వుకుంటే.. మరికొన్నిఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తుతుకూడి జిల్లా కు చెందిన ముత్తు అనే ఓ వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు.. అతడు ఉరల్ ప్రాంతం వద్దకు రాగానే ఎవరూ ఊహించని విధంగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎరువులతో వెళ్తున్న లారీ అతి వేగంగా వస్తుంది.. అదే సమయంలో ఓ బస్తా లారీ నుంచి కింత పడిపోయింది.. దానికి కట్టి ఉన్న తాడు బయటకు వెళాడుతూ ఉంది. అదే సమయానికి ముందు తన బైక్ పై వెళ్తుండగా ఆ తాడు ముత్తు మెడకు చుట్టుకొని అమాంతం గాల్లో ఎగిరి కిందపడిపోయాడు. అదృష్టం కొద్ది తాడు అతని మెడను వీడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.
బైక్ పై నుంచి ఎగిరి కిందపడ్డా ముత్తుకి గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి అతన్ని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అని అంటున్నారు. ఎరువుల బస్తాలకు బందోబస్తుగా తాడు కట్టకపోవడం.. అతి వేగంగా లారీని నడపడం కారణంగ అంటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
லாரியில் இருந்து விழுந்த பாசக்கயிறு.. கழுத்தில் மாட்டி தூக்கி வீசப்பட்ட வாலிபர்!!#thoothukudi #accident pic.twitter.com/6MRkUjlFHA
— A1 (@Rukmang30340218) December 15, 2022