దేశంలో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో తెలంగాణలోని వరంగంల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు పీక్కుతున్న విషయం తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు మరువకముందే తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అయితే మరుసటి రోజు ఇదే శవాన్ని సిబ్బంది పరిశీలించగా కన్ను పూర్తిగా దెబ్బతినింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వైద్యులకు తెలియజేశారు. హుటాహుటినన ఘటనా స్థలానికి చేరుకున్న వైద్యులు, అధికారులు ఆ శవాన్ని పరిశీలించారు. అయితే ఆ శవం కన్ను ఎలుకలు తినేశాయని అధికారులు, వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఆ శవం కన్ను నిజంగా ఎలుకలే తినేశాయ? లేక ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
మరో దారుణమైన విషయం ఏంటంటే? గతంలో ఇదే ఆస్పత్రిలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరికితిన్నట్లుగా అధికారులు తెలిపారు. శవం కన్ను తిన్న ఘటనపై ఘటనపై సీరియస్ అయిన ఆస్పత్రి ఉన్నతాధికారులు అసలేం జరిగిందనే వాస్తవ విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.