ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అంగవైకల్యంతో నరకం అనుభవిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన తరం చేస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకున్న ఓ పికప్ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఒక వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఉదయ్‌పుర్ సమీపంలోని ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న వారు ఖార్పనా గ్రామాంలో ఒక వివాహ వేడుకకు హాజరై వస్తున్నారు. వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుక ఒక ట్రక్కును మాట్లాడుకున్నారు. అదే వాహనంలో తిరిగి ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలోనే ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రక్కు సామర్ధ్యానికి మించి జనాలను ఎక్కించుకోవడం వల్ల డ్రైవర్ అదుపు చేయలేకపోయి ఉండొచ్చని.. అదే మాదానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
उदयपुर में उदयपुर-झाडोल मार्ग पर हुए हादसे में 5 लोगों की मृत्यु अत्यंत दुखद है। शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं, ईश्वर उन्हें इस कठिन समय में सम्बल प्रदान करें एवं दिवंगतों की आत्मा को शांति प्रदान करें। दुर्घटना में घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना है।
— Ashok Gehlot (@ashokgehlot51) April 13, 2022