సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. బాల్యంలోనే వివాహం జరిగినా చదువుల్లో రాణించి భార్య అండతో తాజాగా నీట్ క్లియర్ చేశాడు. డాక్టర్ అవ్వాలన్న తన కళను నిజం చేసుకునేందుకు ఎంబిబిఎస్ చేయనున్నడు.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఓక దానిలో విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ విజయం సాధించడం అంత సులభం కాదు, చాలా సవాలుతో కూడుకున్నది. కృషి, దృఢ సంకల్పం, ఏకాగ్రత ఉంటే తప్ప విజయం సులువుగా లభించదు. అనేక సమస్యలు మరియు అడ్డంకులు లక్ష్యాలను సాధించకుండా అవి మనల్ని అడ్డుపడుతాయి. అలా మనం అక్కడే ఆగిపోకుండా.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను పట్టించుకోకుండా మన లక్ష్యం కోసం ప్రయత్నించాలి.. అలాంటివి అతనికి ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన అన్ని ఓడిదుడుకలను ఎదుర్కొన్నాడు. అయితే ఇలాంటి కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా ప్రయత్నాన్ని విడవకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు ఆ యువకుడు. ఈ యువకుడు అసలు ఇంతకి ఏం సాధించాడు. అని అనుకుంటున్నారా? అయితే తన విజయ సాధనలో ఎన్ని ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందామా.. అవును తెలుసుకుందాము. ఈ కథ ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్ లోని రామ్ లాల్ అనే వ్యక్తి చిత్తోర్ గఢ్ లోని ఘోసుండా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ యువకునికి చదువుకోవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఆ కోరికను సాధించాలని అని కలలు కనేవాడు. అయితే అతను చదువులో చాలా మంచిగా చదువుతున్న రోజులలో.. ఆ వ్యక్తికి అనుకోకుండా 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహాం చేశారు రామ్‌లాల్ కుటుంబసభ్యులు. అప్పుడు తను కేవలం 6 వతరగతి మాత్రమే చదువుతున్నాడు. అలా తన పెళ్లి అయ్యాక.. కొన్ని రోజులు రామ్ లాల్ జీవితం అలా గడిచిపోయింది. ఆ క్రమంలోనే తను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కలలు కంటున్నాడు కదా.. ఆ కళ అంతా నీరుగారిపోయిందని చాలా నిరాశ పడ్డాడు. కానీ అలా కాకుండా తన జీవితం ఓ మలుపు తిరిగింది. అది ఏందంటే.. రామ్‌లాల్ బార్య రామ్ చదువుకుంటాను అని భార్యకు చెప్పగా.. తను సాహాకారం అతనికి తోడయింది. అప్పట్లోనే రామ్ లాల్ భార్య పదోతరగతి వరకు చదువుకుంది. రామ్ భార్యకు పుస్తకం విలువ తెలుసు కాబట్టి భర్తకు అండగా నిలబడింది.
రామ్‌లాల్ తండ్రికి రామ్ చదువుకోవడం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవటానికి పూర్తిగా సహాయం చేసింది. దీంతో రామ్ లాల్10 వ తరగతి లో 74 శాతం ఉత్తీర్ణతతో సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన సైన్స్ కోర్సును తీసుకున్నాడు. వెంటనే నీట్ పరీక్షలకు సిద్దమయ్యాడు. అయితే తను 2019 లో మెుదటిసారి నీట్ పరీక్షను రాశాడు. కానీ దాంట్లో 720 మార్కులు ఉంటే 350 మార్కులు వచ్చాయి. తను అనుకున్నంత మంచి ఫలితం రాలేదు. కానీ తను ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నాన్ని మెుదలు పెట్టాడు. అలా తను వాళ్ళదగ్గర్లో ఉండే ఊరు సమీపాన కోటా నగరం ఉంది. అక్కడికి చేరుకొని ఆ నగరంలో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయి.. నీట్ పరీక్ష కు కావల్సినవన్నీ నేర్చుకొని. ఆ తర్వాత మళ్లీ నీట్ పరీక్ష రాసాడు. దాంట్లో ఈ సారి 490 మార్కులు సాధించి అందరిని ఓక్కసారి ఆశ్చర్యపరిచాడు. దాంతో తనకు ఉన్న ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు. 350 మార్కుల నుంచి..తనకు 490 మార్కులు వచ్చేవరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. చివరగా ఐదో సారికి 490 కి చేరుకున్నానని రామ్‌లాల్ గర్వంగా చెబుతున్నాడు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాదించగలనని చెప్పుకొచ్చాడు. తన భార్య ఇచ్చిన సహాకారాన్ని నేను ఎప్పుడు మరవలేను అని.. తను బావోద్వేగానికి లోనయ్యాడు.