భారతదేశంలో యువతుల వివాహ వయసు 18 ఏళ్లు అని అందరికీ తెలిసిందే. వివాహం చేయాలి అంటే అమ్మాయికి కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఆ వయసును 21 సంవత్సరాలుగా కూడా చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 15 ఏళ్లు నిండిన తర్వాత ముస్లిం యువతులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని, అది బాల్య వివాహం కిందకు రాదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాల్య వివాహాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా కాదంటూ వ్యాఖ్యానించింది. ముస్లిం బాలికలకు ‘ముస్లిం పర్సనల్ లా’ నిబంధనలు వర్తిస్తాయంటూ స్పష్టం చేసింది. ఈ సంచలన తీర్పుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
16 ఏళ్ల యువతికి 26 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమెను భర్తతో కలవనివ్వకుండా చిల్డ్రన్స్ హోమ్ లో ఉంచారు. తన భర్తతో కలిసి ఉండేందుకు తనను విడుదల చేయాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను పరిశీలించిన కోర్టు అనుమతులు జారీ చేసింది. తన భార్యను చిల్డ్రన్ హోమ్ లో ఉంచడంపై జావేద్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను పరిశీలించిన పిదప కోర్టు ఈ అనుమతులు జారీ చేసింది. “పిటిషనర్ విషయంలో.. అతనికి భార్యతో వారి ఇష్టానుసారమే వివాహం జరిగింది. చిల్డ్రన్ హోమ్ లో ఉన్న అమ్మాయి మైనర్ అయినా.. ఇంకా 18 సంవత్సరాలు నిండకపోయినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ ముస్లింలు కావున వారి వివాహం చెల్లుతుందని మేము గుర్తించాం” అంటూ తీర్పునిచ్చారు.
ఇస్లామిక్ చట్టంలోని నింబధనల ప్రకారం వారు కలిసి జీవించేందుకు అనుమతించవచ్చు అంటూ న్యాయస్థానం వెల్లడించింది. వాదనలు, చట్టాలు, రికార్డులు పరిశీలించిన తర్వాత.. యూనస్ ఖాన్ తీర్పు ఆధారంగా వారి వివాహాన్ని గుర్తిస్తూ తీర్పు వెలువరించింది. ముస్లిం యువతి వివాహం వారి వ్యక్తిగత చట్టం ప్రకారం జరుగుతుందని కోర్టు గమనించింది. మహమ్మదీయ న్యాయ సూత్రాలపై వారి వివాహం ఆధారపడి ఉంది. వారి చట్టాలు, నిబంధనల ప్రకారం యువతి యుక్త వయసు 15 సంవత్సరాలు అని.. యుక్తవయసు తర్వాత ఆమె స్వీయ అంగీకారంతో ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అలా చేసుకున్న వివాహం బాల్య వివాహల నిషేధ చట్టం 2006 సెక్షన్ 12ను ఉల్లంఘించినట్లు కూడా కాదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలంగా మారింది.
BREAKING: Muslim girl can marry person of her choice when she turns 15 and this will not be in derogation of Prohibition of Child Marriage Act, says Punjab And Haryana High Court. 16 year old had sought release from child care agency to reunite with 26 year old husband
— LawBeat (@LawBeatInd) October 28, 2022