రైల్వే స్టేషన్లలో, రైళ్లలో కొందరు యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. స్టేషన్లలో వారు చేసే ఆగడాలకు అయితే హద్దే లేకుండా పోతోంది. ముఖ్యంగా సిటీలోని లోకల్ రైళ్లలో వీరు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రైలు బయలు దేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ తోటివారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. వీరు చేసే పనుల వల్ల కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో, లోకల్ రైళ్లలో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఇలాంటి ఆకతాయిలపై తమిళనాడులోని చెన్నై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. రైళ్లలో వీరంగ సృష్టించే వారిని కటకటాలోకి పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు తెలిపిన ప్రకారం..
చెన్నై నగరంలో ఎలక్ట్రిక్ , ఎంఆర్టీఎస్ రైళ్లలో కొందరు విద్యార్ధులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రైలు కదులుతున్న సమయంలో డోర్లు, కిటీకిలు పట్టుకుని వేలాడటం వంటి సాహసాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు పట్టు తప్పి కిందపడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీరి చేష్టల వల్లన ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక యువకులు గ్రూపులగా విడిపోయి లోకల్ రైల్వే స్టేషన్లలో కొట్టుకుంటున్నారు. దీంతో అక్కడి వచ్చే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. కేసులు పెడితే ఆ యువకుల జీవితంపై ప్రభావం పడుతుందని ఆలోచించారు. అందుకే ఇప్పటి వరకు కేవలం హెచ్చరిస్తూ వదిలేస్తున్నారు.
అయితే తాజాగా చెన్నై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని లోకల్ రైళ్లలో, స్టేషన్లలో వీరంగ సృష్టించిన, సాహసాలు ప్రదర్శించిన జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్ధులకు హెచ్చరికలు చేస్తూ రైల్వే , పోలీసులు యంత్రాంగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆకతాయి తనంతో ఇష్టారాజ్యంగా వీరంగం సృష్టిచినా, సహసాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టుపడితే మూడు నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.