2023-24 ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టారు. మహిళలకు పలు పథకాలు ప్రకటించిన ఆమె.. పిఎం వికాస్ (ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్) యోజన అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. శతాబ్దాల తరబడి తమ చేతి వృత్తులు, సంప్రదాయ వృత్తుల ద్వారానే జీవనం సాగించే వారిని విశ్వకర్మలుగా భావిస్తారు. కళలు, హస్త కళాలను సహకరించేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వేలాది మంది హస్త కళాకారులు నైపుణ్య సామర్ధ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో దీన్ని తెస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా వృద్ధి అవకాశాలను ఉపయోగించుకుని, దేశ అభివృద్ధిలో వీరు బలమైన భాగం అవుతారని పేర్కొన్నారు.
సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల వారి కోసం ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ వృత్తుల్లో ఉన్నవారికి నైపుణ్య శిక్షణ అందించడం, సాంకేతికతను సమకూర్చడం, అభివృద్ధి, సాధికారిత కోసం కేంద్రం ఆర్థిక సహాకారం అందిస్తోంది. దీని ద్వారా తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జన బాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
PM VIKAS (Pradhan Mantri Vishwakarma Kaushal Samman), which was announced in Budget 2023, will include skilled people who are engaged in various traditional and skilled professions. pic.twitter.com/N5lCaJN6Ft
— ANI (@ANI) February 1, 2023