భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కుటుంబ సమేతంగా మైసూరు వెళ్తున్న సమయంలో ప్రహ్లాద్ మోదీ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య , కుమారుడు మోహల్ మోదీ , కోడలు జిందాల్ మోదీ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో కొడుకు, కోడలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబం సభ్యులతో కలిసి మైసూరు సమీపంలోని బండిపురాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కడకోల సమీపంలో రాగానే ఈ కారు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న మైసూరు డిప్యూటీ కమిషనర్ సీమా లత్కర్ వెంటనే..ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రహ్లాద్ మోదీ, ఆయన కుమారుడు , కోడలు , మనవడు మెహత్, కారు డ్రైవర్ సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రహ్లాద్ మోదీ కొడుకు , కోడల్ పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. ఇంకాఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.