ఈ మద్య రాజకీయ నేతలు తమ మంచిమనసు చాటుకుంటూ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంత పెద్ద హూదాలో ఉన్పప్పటికీ.. రోడ్డు పై ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని రక్షించి తమ సొంత కాన్వాయ్ లో ఆసుపత్రులకు తరలించడం.. వారు ప్రయాణించే మార్గంలో అంబులెన్స్ వస్తే దారి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఒక అంబులెన్స్ రావడంతో.. తన కాన్వాయ్ నిలిపి ఆ వాహనానికి దారి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హిమాచల్ ప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ క్రమంలో అక్కడ అన్ని పార్టీల వారు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సుజన్ పూర్ లో భారీ బహిరంగ సభకు హాజరై తిరిగి గాంధీ నగర్ కు రోడ్డు మార్గంలో వస్తున్నారు.. అదే సమయంలో ఒక అంబులెన్స్ అటుగా వస్తుంది. అది గమనించిన ప్రధాని మోదీ తన కాన్వాయ్ ని రోడ్డు పక్కన నిలిపి ఆ అంబులెన్స్ కి దారి ఇచ్చారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత ప్రధాని తన వాహనంలో వెళ్లిపోయారు.
ఇలా రోడ్డు పై అంబులెన్స్ లకు దారి ఇవ్వడం ప్రధానికి ఇదేమీ కొత్త కాదు.. గతంలో కూడా గుజరాత్ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్ నుంచి రోడ్డు మార్గాన వస్తున్న సమయంలో ఒక అంబులెన్స్ కి తన కాన్వాయ్ ని పక్కకు ఆపి మరీ దారి ఇచ్చారు. ఎంత పెద్ద హూదాలో ఉన్నా.. సాటి మనిషిని రక్షించేందుకు తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రదాని మంచి మనసుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
यूं ही नहीं प्रधानसेवक कहलाते…
हिमाचल में एंबुलेंस को रास्ता देने के लिए रुकवाया अपना काफिला।
बहुमूल्य जीवन की रक्षा के लिए आप भी हमेशा एंबुलेंस को रास्ता दें! pic.twitter.com/8VjPoQIPSZ
— BJP (@BJP4India) November 9, 2022