టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా అక్కడక్కడ అసమానతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ పట్ల వివక్షత కొనసాగుతుంది. వారికి నిత్యం అనేక చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమాజంలో వీరు గౌరవంగా ఉండేందుకు ఆయా సంస్థలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ కేఫ్ యాజమాని.. ట్రాన్స్ జండర్ల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుకుందాం.
ముంబైలోని వెర్సోవాలో బంబై నజారియా కేఫ్ ఉంది. రెండు నెలల కిందట దీన్ని ప్రారంభించారు. సామాజికంగా ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలనే ఒక సంకల్పంతో ఈ కేఫ్ ఏర్పాటైంది. అందులో భాగంగా ఇక్కడ పని చేసే వాళ్లంతా ట్రాన్స్ జెండర్సే. అసలు ఈ కేఫ్ ఏర్పాటు చేసిందే వారికి ఉపాధి కల్పించడం కోసమని యాజమని చెబుతున్నారు. “నజారియా బదలో.. నజారా బద్‌లేగా” అంటే.. ముందు నువ్వు మారు.. తర్వాత ప్రపంచం దానంతట అదే మారుతుంది.. అనే నినాదంతో బంబై నజారియా కేఫ్ ను ఏర్పాటు చేశారు.
సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జండర్లకు అండగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసం నింపటమే లక్ష్యంగా బంబై నజారియా కేఫ్ పనిచేస్తుండటం విశేషం. ట్రాన్స్‌జెండర్స్‌ను మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోవడంతో.. వెర్సోవా ప్రాంతంలో ఈ కేఫ్ ఫేమస్ అయిపోయింది. లింగమార్పిడి చేసుకున్న వారికి దారి చూపించిన ఆ కేఫ్ ఓనర్‌కు స్థానికులు సలాం కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఓ కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్సే పనిచేయడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.