దేశంలో వైద్యం అందని ద్రాక్ష. ప్రభుత్వ ఆసుపత్రులున్నా.. కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వాటి కోసం ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాల్సిందే. అక్కడ దొరికే కార్పొరేట్ వైద్యంతో జేబులకు చిల్లులు పడాల్సిందే. చిన్న రోగానికి కూడా వేల చదివించాల్సి వస్తుంది. అలాంటి వారికి రూపాయికే వైద్య సేవలందిస్తున్నారూ ఈ డాక్టర్.
ఈ రోజుల్లో వైద్యం ఖరీదై పోయింది. చిన్న తలనొప్పికని ఆసుప్రతికి వెళితే వేలల్లో ఖర్చులు అయిపోతున్నాయి. డాక్టర్ ఫీజుల నుండి మెడిసన్ వరకు డబ్బులు చెల్లించే సరికి జేబులు ఖాళీ కావాల్సిందే. పోనీ ఒక్కసారి తగ్గిపోతుందా అంటే.. కాదూ మళ్లీ మళ్లీ వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. వారి ఫీజు కూడా చాలా మొత్తంలో ఉంటుంది. పోనీ సరైన వైద్యం లభిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. చిన్నజబ్బులకే ఇలా ఉంటే.. ఇక పెద్ద వ్యాధి వస్తే ధనవంతులు మాత్రమే నయం చేయించుకోగలరు. పేద, మధ్యతరగతి వారికి ఖరీదైన వైద్యం అందని ద్రాక్షే. ఇలాంటి వారికే తానున్నంటున్నారు డా. వినయ్ వర్మ.
చత్తీస్‌గఢ్ రాయ్ పూర్‌కు చెందిన వినయ్ వర్మ అంబేద్కర్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. పేద వారి కోసం తన క్లినిక్ లో ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నారు. నాలుగేళ్లుగా రూపాయి ఫీజు తీసుకుని వైద్య సేవలు అందిన్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆయన ఇంట్లోనే పేషంట్లకు వైద్యం అందించడంతో పాటు 11 నుండి ఒంటి గంట వరకు కెకె రోడ్ లో ఉన్న తన క్లినిక్ లో సేవలందిస్తున్నారు. దీనికి ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నట్లు డాక్టర్ వినయ్ వర్మ వెల్లడించారు. 2020లో కరోనాతో దేశాన్ని అతలాకులతం చేసిందని, ఆ సమయంలో ఆసుపత్రుల్లో బెడ్స్, చికిత్స అందక చాలా మంది ఆవేదన పడటం తనను కలిచి వేసిందని, ఆ సమయంలో ఉచితంగా వైద్య సేవలు అందించానని తెలిపారు.
మెడికల్ ఆఫీసర్ గా, డాక్టర్ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారన్న దానికి ఆయన సమాధానం ఇచ్చారు. తాను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సంబంధించి బాధ్యతలు చూసుకుంటానని, విధులు లేని సమయంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో కొంత మంది మెడిసన్లకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే.. వారికి మందులు కూడా ఉచితంగా ఇచ్చినట్లు తెలిపారు. రోజుకు సుమారు 30 నుండి 40 మంది వైద్యులను చూస్తానని తెలిపారు. ఆయనకు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఆదర్శమని చెప్పారు. ఒక్కసారి ఆసుపత్రికి వెళితే జేబులు ఖాళీ అవుతున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయికే వైద్యం అందించడం నిజంగా గ్రేట్. రూపాయికే వైద్య సేవలు అందిస్తున్న ఈ డాక్టర్ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.