లవర్స్‌కి ప్రేమికుల రోజు ఎంతో ప్రత్యేకం.. సంవత్సరంలో ఎన్ని రోజులున్నా సరే.. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇచ్చి వారిపై తమ ప్రేమను చాటుకుంటారు. ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి కొందరు బంగారు గులాబీలు పంపారు. ఇంతకు వారు ఎవరంటే..
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. మనసైన వ్యక్తికి.. తమ మనసులోని మాట చెప్పడానికి సరైన రోజుగా వాలెంటైన్స్ డేని భావిస్తారు చాలా మంది లవర్స్. ప్రేమలో ఉన్నవారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకం. మిగతా రోజుల్లో కన్నా ఆ రోజును ఆలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. విభిన్నమైన బహుమతులతో లవర్‌ని ఆశ్చర్యపరుస్తారు. ప్రేమికులు, భార్యభార్తలు ఇలా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం అన్నది సర్వసాధారణం. కానీ ప్రేమికుల రోజున ప్రధాని నరేంద్ర మోదీకి గిఫ్ట్ ఇవ్వడం.. అది కూడా బంగారు గులాబీలు బహుమతిగా ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. మరీ మోదీకి ఈ కానుక పంపింది ఎవరో తెలియాలంటే ఇది చదవండి..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మోదీకి బంగారు గులాబీలు గిఫ్ట్‌గా పంపారు. ఎవరు అంటే విద్యార్థులు. సూరత్‌కు చెందిన విద్యార్థులు.. బంగారు పూత పూసిన గులాబీలను మోదీకి బహుమతిగా ఇవ్వడానికి రెడీ అయ్యారు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూసిన 151 గులాబీలను మోదీకి ఇవ్వనున్నారు విద్యార్థులు. మోదీపై తమకు గల ప్రేమను తెలిపేందుకు ఇలా బంగారు గులాబీలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక మోదీకి విద్యార్థులతో గడపడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికిన ప్రతి సారి విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఇక ప్రతి ఏటా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయం పొగొట్టడానికి పరీక్షా పే చర్చ జరుపుతారు. విద్యార్థులే సమాజాభివృద్ధికి ప్రధాన కారకులు.. వారే దేశ భవిష్యత్తుగా మోదీ అభిప్రాయపడతారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా మోదీకి బంగారు గులాబీలు బహుమతిగా ఇచ్చి.. మోదీపై తమ ప్రేమ చాటుకున్నారు విద్యార్థులు.
మోదీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన భార్య పేరు యశోదా బెన్. ఆమె స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసింది. వివాహ సమయంలో మోదీ వయసు 18 సంవత్సరాలు కాగా.. యశోదా బెన్ వయసు 17 సంవత్సరాలు. వీరికి 1968లో వివాహం అయ్యింది. కానీ కొద్ది కాలానికే వీరు విడిపోయారు. మోదీ రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. ఆ విషయాన్ని యశోదా బెన్‌కు వివరించి.. ఆమె నుంచి దూరం అయ్యారు. మోదీకి వివాహం అయిన సంగతి చాలా కాలం వరకు ఎవరికి తెలియదు.
2014 జనరల్ ఎన్నికల సమయంలో వీరి వివాహం గురించి సమాజానికి తెలిసింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత యశోదా బెన్ చదువు కొనసాగించి.. టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు. తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరి అభిప్రాయాలు వేరు కావడంతోనే విడిపోయామని యశోదా బెన్ వెల్లడించారు. మోదీకి తల్లితో అనుబంధం ఎక్కువ. కొన్ని రోజుల క్రితం ఆమె కూడా మృతి చెందారు. మరి మోదీకి విద్యార్థులు ఇచ్చిన బహుమతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.