కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఈ కేసుల సంఖ్య 37కు చేరింది. నిన్నటి వరకు 33గా ఉన్న కేసుల సంఖ్య ఏపీ, ఛండీగఢ్, కర్ణాటకలో నమోదైన కేసులతో కలిపి 37కు చేరాయి. ఏపీ, ఛండీగడ్ లో తొలి కేసు నమోదైంది. నవంబర్ 22న బంధువులను కలిసేందుకు ఇటలీ నుంచి 20 ఏళ్ల యువకుడు వచ్చాడు. హోం క్వారంటైన్ లో ఉన్న అతనికి డిసెంబర్ ఒకటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కు నమూనాలు పంపారు. అందులో ఒమిక్రాన్ వేరియంట్ గా తేలింది. అతను గతంలోనే రెండు డోసుల టీకా తీసుకున్నాడని.. అతనికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఏడుగురికి పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ లో ఉంచారు.
A 20-year-old man from Italy, who landed in India on Nov 22 & was diagnosed with COVID on Dec 1, has tested positive for #Omicron variant. He is fully vaccinated with Pfizer vaccine. He has been tested for COVID-19 again today & the report is awaited: Chandigarh Health department
— ANI (@ANI) December 12, 2021
తాజా కేసుతో కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చిన 34 ఏళ్ల వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. అతనికి సంబంధించిన కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఏపీలోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
4 New #Omicron Cases Today, 37 So Far In India: 10 Updates https://t.co/6UKYUqBlD9 pic.twitter.com/OeCb0s0vR9
— NDTV (@ndtv) December 12, 2021