తల్లి మనకు జన్మనిస్తే.. వైద్యులు పలు సందర్బాల్లో మనకు పునర్జన్మనిస్తుంటారు. ప్రాణాలపై ఆశలు వదులుకున్న సమయంలో డాక్టర్లు మన ప్రాణాలు కాపాడి మళ్లీ కొత్త జీవితాన్ని ఇస్తుంటారు. అందుకే దేవుడి తర్వాత వైద్యులను దేవుళ్లుగా భావిస్తుంటారు. అప్పుడే పుట్టిన ఓ చిన్నారి ఊపిరి ఆడకపోవడంతో పాప బతికే అవకాశం లేదని అందరూ భావించారు. చిన్నారి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వేళ.. వైద్యురాలు అద్భుతం చేశారు. పసిబిడ్డకు ప్రాణం పోసి కాపాడారు. నోట్లోకి గాలి ఊది చిన్నారిని బతికించారు. ఈ అద్భుతమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ తల్లి చిన్నారికి జన్మనిచ్చింది. పాప జన్మించిన తర్వాత ఆక్సిజన్ తీసుకోవడం లేదని వైద్యులు గ్రహించారు. వెంటనే ఇంక్యుబేటర్ లో ఉంచి ఆక్సీజన్ అందించాలని భావించారు.. కానీ అదే సమయానికి ఆ మిషన్ పనిచేయలేదు. దీంతో వైద్యురాలు సురేఖ చౌదరి స్వయంగా చిన్నారికి ఊపిరి అందించారు. ఏడు నిమిషాల తర్వాత పాప ఏడుపు వినిపించింది. దీంతో తల్లిదండ్రులతో పాటు వైద్య సిబ్బంది సంతోషంలో మునిగితేలారు. నిజంగా ఆ పాప పాలిట దేవతగా మారి వైద్యురాలు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.