ఆర్థిక నగరం ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం బాంద్రాలోని నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. సిగ్నల్ వద్దకు బస్సు రాగానే మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు రోడ్డు పక్కకు ఆపేశాడు. ప్రయాణీకులందరినీ బస్సులో నుండి దింపేశారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందిని సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్సు మొదటి భాగం మంటల్లో కాలిపోయింది.
మంటలను ఆర్పే క్రమంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించడంతో అటుగా వెళ్లిన వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఎగసి పడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో నుండి ప్రయాణీకులందరినీ దింపేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా, బస్సు నిలిపి వేసిన ఎదుటే.. పెట్రోల్ బంక్ కూడా ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.