ఓ ఎంపీ అధికార దుర్వినియోగం చేస్తున్నాడన్న ఆరోపణపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో చట్టానికి ఎవరూ అతీతులు కారు అని నిరూపితమైంది. అవినీతి, అన్యాయం, అధర్మ సూత్రాలతో అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధికి చెంపపెట్టులా వచ్చింది హైకోర్టు తీర్పు. సామాన్యుడు తిరగబడితే వచ్చే పరిణామాలేంటో తెలియజేశారు. సామాన్యుడి పోరాటం అసామాన్యుడి పదవికే ఎసరు పెట్టింది.
కోర్టులో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా.. ఓ ఎంపీ అధికార దుర్వినియోగం చేస్తున్నాడన్న ఆరోపణపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో చట్టానికి ఎవరూ అతీతులు కారు అని నిరూపితమైంది. అవినీతి, అన్యాయం, అధర్మ సూత్రాలతో అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధికి చెంపపెట్టులా హైకోర్టు తీర్పు మారింది. సామాన్యుడు కన్నెర్రజేస్తే.. ఓటరు రాజకీయ నాయకులపై తిరగబడితే వచ్చే పరిణామాలేంటో తెలింది. సామాన్యుడి పోరాటం అసామాన్యుడి పదవికే ఎసరు పెట్టింది. ఇదంతా పూర్తి వివరాలతో తెలియాలంటే స్ఫూర్తి కలిగిస్తున్న ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని చదవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే…
తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు క్రియా శీలకంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. రవీంద్రనాథ్ తన సొంత జిల్లా అయిన ‘తేని’ నుండి పోటీ చేశాడు. ఆ సమయంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడం, తండ్రి డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్‌కు కలిసివచ్చింది. ఎన్నికల సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చినా ఎన్నికల అధికారి చూసిచూడనట్లు వ్యవహరించారు. అప్పటి ఎన్నికల్లో రవీంద్రనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలోని ఓటరు అయిన మిలానీ రవీంద్రనాథ్ నామినేషన్ మొదలుకుని ఎన్నికల ఫలితాల వరకు జరిగిన అవినీతి అక్రమాలను, అధికార దుర్వినియోగం, మనీ ట్రాన్సాక్షన్ మొదలైన అన్ని ఆధారాలను సేకరించి.. కోర్టును ఆశ్రయించాడు.
2019 లోక్ సభ ఎన్నికల్లో తేని జిల్లాలో జరిగిన అక్రమాలపై పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టులో రవీంద్రనాథ్‌ను వివరణ కోరగా ఆయన దగ్గర సమాధానం లేకపోవడంతో పదవిపై వేటు పడింది. గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలతో నిరూపితమైందని.. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పును ప్రకటించారు.
ఆ నియోజకవర్గ ఓటరుగా మిలానీ కోర్టులో పిటిషన్ వేశాడు. అన్నాడీఎంకేలో పార్టీ చీలికతో పన్నీరు సెల్వం కొత్తసమూహంతో రాజకీయ పయనం కావడంతో రవీంద్రనాథ్‌కు పార్టీలో వ్యతిరేకత మొదలైంది. ఆయన తమ పార్టీ ఎంపీగా పరిగణించొద్దని పార్తేటీ తేల్చింది. గతంలో సాగిన అక్రమాలపై ఈడీ సోదాలు చేయడం.. రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలను రవీంద్రినాథ్ ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత ఓటరు మిలానీతో ఏకంగా రవీంద్రనాథ్ ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.