ఇటీవల కాలంలో నటీనటులు విమాన ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి పలు చేదు అనుభవాలు కూడా అయ్యాయి. గతంలో ఫ్లైట్ లేటు అయినా తెలపలేదంటూ బ్రహ్మజీ, మిస్ అయిన తన లగేజీ గురించి వివరాలివ్వలేదని రానా ఫైర్ అయిన సంగతి విదితమే. తాజాగా మరో నటికి చేదు అనుభవం ఎదురైంది.
ఇటీవల కాలంలో నటీనటులకు విమాన ప్రయాణాల్లో చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. రానా, బ్రహ్మజీతో పాటు పలు బాలీవుడ్, కోలీవుడ్ నటులు సైతం పలు విమానయాన సంస్థలపై ఫైర్ అయినవారే. తాజాగా మరో నటికి కూడా ఓ గుజుప్సాకరమైన అనుభవం ఎదురైంది. ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ మిమీ చక్రవర్తికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ నుండి ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆ సంస్థపై ఫైర్ అవ్వడంతో సదరు ఎయిర్ లైన్స్ వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
బెంగాల్‌లోని జాదవ్‌పూర్ ఎంపి మిమీ చక్రవర్తి ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమెకు అందించిన ఫుడ్ లో ఊహించని విధంగా వెంటుక్రలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సదరు ఎయిర్ లైన్స్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన చిత్రాలను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. తాను ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందనా రాలేదన్నారు. ‘డియర్ ఎమిరేట్స్ మీ ప్రయాణీకుల పట్ల మీరు తీసుకుంటున్న శ్రద్ధ విషయంలో విచారిస్తున్నాను. భోజనంలో వెంటుక్రలు రావడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. ఈ విషయాన్ని మీకు మెయిల్ చేశాను. అయితే ఈ విషయంపై స్పందించాలని కానీ క్షమాపణలు చెప్పాలని సంస్థ ప్రతినిధులు భావించినట్లు లేదు’అంటూ ట్వీట్ చేశారు.
సంబంధిత విమాన సర్వీసు ప్రతినిధులకు ఇప్పటికే మెయిల్స్ చేశానని మిమీ చక్రవర్తి తెలిపారు. మీరు మరింత శ్రద్ధ పెడితే తాను చేసిన మెయిల్ వివరాలు తెలుస్తాయంటూ ఆగ్రహించారు. ఓ ఎంపీ మెయిల్ చేస్తే.. సమాధానం రాలేదు. అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? మేము సమాధానాల కోసం చూస్తున్నామని అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఆమెను క్షమాపణలు కోరుతూ, దయచేసి ఫీడ్‌బ్యాక్‌ను మాకు పంపండని పేర్కొంది . మొత్తం విషయంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. దీని తర్వాత కస్టమర్ రిలేషన్ టీమ్ దానిని సమీక్షిస్తుందని తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ మొత్తం సమస్యకు సంబంధించి మిమీ చక్రవర్తి డీఎంని వివరణ కోరారు. ఆమె బెంగాలీ సినిమాలతో పాటు..టెలివిజన్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Dear @emirates i believe u hav grown 2 big to care less abut ppl traveling wit u.Finding hair in meal is not a cool thing to do i believe.
Maild u nd ur team but u didn’t find it necessary to reply or apologise @EmiratesSupport
That thing came out frm my croissant i was chewing pic.twitter.com/5di1xWQmBP— Mimi chakraborty (@mimichakraborty) February 21, 2023
Hello, I’m sorry to know this. Please write your feedback here https://t.co/hvRU3yFHZ2 by completing an online form, our Customer Relations Team will review it based on the matter raised and respond to you via email. Please DM us for any help. Thanks.
— Emirates Support (@EmiratesSupport) February 21, 2023