నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
ఇటీవల కాలంలో నటీనటులు విమాన ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి పలు చేదు అనుభవాలు కూడా అయ్యాయి. గతంలో ఫ్లైట్ లేటు అయినా తెలపలేదంటూ బ్రహ్మజీ, మిస్ అయిన తన లగేజీ గురించి వివరాలివ్వలేదని రానా ఫైర్ అయిన సంగతి విదితమే. తాజాగా మరో నటికి చేదు అనుభవం ఎదురైంది.
అనుకున్నంత పని జరిగింది. త్వరలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలిపోయింది. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యతలు ముందుగా భారత్ దక్కించుకుంది. కానీ.., ఇప్పుడు దేశంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ భయం ఎక్కువ అయ్యింది. ఇలాంటి సమయంలో ఇండియాలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణ పూర్తిగా సాధ్యం కాక సగం మ్యాచ్ లను యూఏఈకే తరలించారు. […]
ఆయన్నిఅందరూ రెయిన్‌బో షేక్ అని ముద్దుగా పిలుస్తారు. మెర్సిడస్ కంపెనీకి చెందిన బెంజ్ ఎస్-క్లాస్ కార్లు ఏడింటిని కొని వాటికి ఇంద్రధనస్సు రంగులు వేయించారు. వారంలో రోజుకో రంగు కారులో తిరిగేవారు. అందుకే ఈయనకు కార్లంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఈయన గ్యారేజ్‌లో మూడు వేల కార్లు ఉన్నాయి. అసలు పేరు హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ అబుదాబి రాజు, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మొదటి అధ్యక్షుడి కొడుకు. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. వ్యాపారవేత్త. […]