సాధారణంగా ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చి తమకు ఓటు వేయాలని పోటీ చేసే అభ్యర్థులు కోరుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ది పనులు చేస్తామని హామీలు కూడా ఇస్తుంటారు. అయితే కొంత మంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత అటు ముఖం కూడా తిప్పి చూపరు. కానీ కొంత మంది నాయకులు మాత్రం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వవిధాలుగా ఆ పనులు జరిగేలా చూస్తుంటారు.
ఇది కూడా చదవండి : ‘ఓటిటి’లోనూ రికార్డుల మోత మొదలుపెట్టిన అఖండ!
తాజాగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే బస్సు డ్రైవర్ గా మారి ప్రయాణీకులను సంతోష పెట్టారు. ఈ సంఘటన తమిళనాడులోని పూమ్పుహార్ నియోజకవర్గంలో జరిగింది. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎమ్మెల్యే నివేద మురుగన్ బస్సు డ్రైవర్గా మారారు. ప్రయాణీకులు నిండిన తర్వాత సుమారు అరకిలో మీటరు వరకు బస్సును నడుపుకుంటూ వెళ్లారు. ఐదేళ్ల తర్వాత.. తిరువిడైకళి నుంచి మైలాడుతురై మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించింది ప్రభుత్వం. ఆయన నియోజకవర్గం పూమ్పుహార్లో నిర్వహించిన ప్రభుత్వ బస్సు సేవల ప్రారంభోత్సవంలో ఈ సంఘటన జరిగింది.
తిరువిడైకళిలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి బస్సు సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే మురుగన్. తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని.. ప్రజల సంతోషమే తనకు ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురుగన్ అన్నారు. అయితే డ్రైవర్ గా మారి మురుగన్ ప్రయాణికులతో ఉన్న బస్సును 6 కిలోమీటర్లు తీసుకెళ్లి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.