నిత్యం సమాజంలో అనేక వివాదలు జరుగుతునే ఉంటాయి. కొన్ని వర్గాలకు సంబంధించినవి కాగా మరికొన్ని వ్యక్తుల మధ్య జరిగేవి ఉంటాయి. తాజాగా దేవుళ్ల, దేవతల పోస్టర్ లపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా శివ పార్వతుల వేషంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ పై ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ సమస్యలను హైలెట్ చేస్తూ ఓ వీధుల్లో ఓ నాటకం ప్రదర్శింస్తూ కనిపించారు. దీంతో ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడి వేషం వేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. వివరాల్లోకి వెళ్తే…
అసోంలో నాగన్ పట్టణంలో ధరల పెరుగుద, ద్రవ్యోల్బణ సమస్యలపైన కొందరు నిరసనలు తెలుపుతున్నారు. మరికొందరు సమస్యలను హైలెట్ చేస్తూ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలో శివుడు, పార్వతి వేషాధారణలో ఇద్దరు రాయల్ ఎన్ ఫీల్డ్ పై వీధుల్లో తిరుగుతూ పెరుగుతున్న ధరలను ప్రస్తావిస్తూ “నుక్కడ్” అనే నాటకం ప్రదర్శిస్తూ కనిపించారు. వీధుల్లో శివపార్వతుల వేషాల్లో తిరగటం పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనకు చేసి శివుడి వేషంలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. త్వరలో కోర్టులో హాజరుపరచున్నట్లు పోలీసులు తెలిపారు. మరొకవైపు ఈ నాటక ప్రదర్శనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరొ ఇద్దరు ఇంకా దొరకలేదని స్థానిక పోలీసులు అధికారి మనోజ్ రాజవంశీ తెలిపారు.
సామాన్యుల సమస్యలను తెలియజేయడం కోసం నుక్కడ్ నాటకం స్పష్టంగా ప్రదర్శించబడింది. అయితే హిందూ దేవుళ్లను అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శించారు. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంస్థలు హిందూ దేవుణ్ణి, దేవతలను చెడ్డగా చిత్రీకరించారని, అలా చేసే స్వేచ్ఛ ఎవరికి లేదని ఆరోపించారు. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
They dressed up as Lord Shiv & Goddess Parvati. If you want to protest, sit & do it. We don’t support their act of dressing up as deities. BJP lodged FIR: Raja Pareek, a BJP worker
The arrested man, through his street play, was protesting against rising fuel price & unemployment pic.twitter.com/rvxHaINyWE
— ANI (@ANI) July 10, 2022