గతంలో ఎంతో మంది సమాజం కోసం బతికితే.. ఇప్పుడు మాత్రం చాలా మంది సోషల్ మీడియా కోసం బతుకుతున్నారు. ఏం చేసినా, ఏం తిన్నా, ఎక్కడికి వెళ్లినా నట్టింట్లో ఉన్న వారికి చెప్పినా లేకపోయినా కూడా.. నెట్టింట మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది అయితే రీల్స్, సోషల్ మీడియా పోస్టుల మాయలో పడి కుటుంబాలను, కాపురాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.
రైలు పట్టాలపై వీడియోలు చేయడం, రైలు పక్కనే నడుస్తూ ఫోజులు కొట్టడం, రైలు బోగీలో ప్రమాదకరంగా ఫీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. చాలామంది యువత ఈ మాయలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే లోకో పైలట్ లాంటి వాళ్లు అన్ని రైళ్లలో ఉంటే అలా వీడియోలు చేసే వాళ్లు చాలా వరకు తగ్గిపోతారు. సందర్భం ఏదైనా ఈ లోకో పైలట్ లాగానే అందరూ వ్యవహరించాలంటూ కోరుతున్నారు. విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి రైలుకి ఎదురుగా పట్టాలపై కూర్చున్నాడు. అటుగా రైలు వస్తూ ఉంది. అతను పట్టాలపై నిల్చుని చేతులు ఊపుతూ ఉన్నాడు.
రైలు దగ్గరికి వస్తున్న సమయంలో పైకి లేచి పక్కకు వెళ్లిపోయాడు. అతని వల్ల రైలుని ఆపాల్సి వచ్చింది. రైలు ఆపిన లోకో పైలట్ దిగొచ్చి అతడిని వెంబడించాడు. అతని దగ్గరకు వచ్చి వెనుక నుంచి మాడు పగిలేలా ఒక్కటిచ్చాడు. అతను కొట్టిన దెబ్బకు ఆ వ్యక్తి కింద పడిపోయాడు. వెంటనే చేయి పట్టుకుని నాలుగు తగిలించాడు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో అలా చేశాడని కూడా చెబుతున్నారు. మరోవైపు ఇది ఏడాది క్రితం వీడియో కాగా.. ఇప్పుడు వైరల్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏదైనా కావచ్చు.. రైలు పట్టాలపై పిచ్చి వేషాలు వేసే వారికి మాత్రం ఈ లోకో పైలట్ తరహాలో బుద్ధి చెప్పాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
सोशल मीडिया पर ये वीडियो वायरल हो रहा है जहां ये व्यक्ति पटरी पर आकर चलती ट्रेन को रोकता है।
फिर ट्रेन चालक ट्रेन से उतर कर इस व्यक्ति के कान और गाल थप्पड़ से गर्म कर देता है। pic.twitter.com/niKlSVCn2X
— Shubhankar Mishra (@shubhankrmishra) December 26, 2022