ఇటీవలే విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా విమానంలో మరో ఘటన చోటుచేసుకుంది. విమానంలో సిగరేట్ కాల్చవద్దనందుకు ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. అతడు ఎంత చెప్పిన వినకపోవడంతో సిబ్బంది.. అదిరిపోయే శిక్ష విధించారు.
ఈమధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులతో ర్యాష్ ప్రవర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే విమానంలో ఓ ప్రయాణికుడు.. పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు తోటి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. విమానంలో సిగరెట్ కాల్చవద్దన్నందుకు సిబ్బందిపై చిందులేశాడు. అంతటితో ఆగత విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన లండన్ నుంచి ముంబయి వస్తున్న విమానంలో శనివారం చోటుచేసుకుంది.
భారత సంతతికి చెందిన రమాకాంత్(37) అనే వ్యక్తి మార్చి10న లండన్ నుంచి ముంబయికి ఎయిరిండియా విమానంలో వస్తున్నాడు. ఈ క్రమంలో తాను సిగరెట్ కాల్చాలని భావించాడు. దీంతో అతడు విమానంలోని బాత్ రూమ్ లోకి వెళ్లి పొగతాగడం మొదలు పెట్టాడు. అతడు సిగరెట్ కాల్చడం ప్రారంభించగానే విమానంలోని అలారమ్ మోగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎందుకు అలారం మోగిందా? అని సిబ్బంది తనిఖీ చేశారు. చివరకు బాత్ రూమ్ లో రమాకాంత్ సిగరేట్ తాగుతు కనిపించాడు.
వెంటనే అతడి చేతిలో ఉన్న సిగరెట్ ను సిబ్బంది లాక్కున్నారు. దీంతో అతడు వారిపై గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అతిగా ప్రవర్తిస్తున్న అతడిని బలవంతంగా సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతడు వారి నుంచి విడిపించుకుని విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు, తన బ్యాగులో బుల్లెట్ కూడా ఉందని బెదిరించాడు. అయితే, తనిఖీల్లో ఎటువంటి అనుమానిత వస్తువులు అతడి బ్యాగులో లభ్యం కాలేదు. అలా ఎంత సర్ధి చెప్పిన అతడు వినకపోవడంతో చివరకు కాళ్లు చేతులు కట్టేసి.. కుర్చీలో కూర్చునేలా చేశామని సిబ్బంది తెలిపారు.
అలానే విమానం ముంబై ఎయిపోర్టుకు చేరుకున్న వెంటనే నిందితుడిని అక్కడి భద్రత సిబ్బందికి అప్పజెప్పారు. అనంతరం అతడి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి విచారణలో అతడు భారత సంతతి వ్యక్తి తెలింది. అలానే అతడు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా విమానంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. దీంతో నిందితులపైనే కాకుండా విమానయాన సంస్థలపై కూడా ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. విమానాల్లో తరచూ ఇలా జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.