మాములుగా పాము కనిపిస్తే చాలు చాలా మంది మీటర్ల మేర పరుగులు తీస్తారు. అది కనిపించినా లేక ఊహించుకున్న భయంతో ఊగిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి అంతా గుండెలదరిపోయేలా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే..?ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా గంభారీపటియా అనే గ్రామంలో భద్ర అనే వ్యక్తి పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికెళ్లేందుకు సిద్దమయ్యాడు. దీంతో పొలం గట్ల మీద నుంచి అతడు వెళ్లే మార్గంలో పొదలు, చెట్లతో అంతా నిండిపోయింది. అలాంటి దారిలో ఇంటికెళ్తున్నాడు భద్ర.
ఇక అతడు వెళ్తున్న మార్గంలో అటు నుంచి పాము వచ్చేది అతను తెలుసుకోలేకపోయాడు. దీంతో ఆ పాము మెల్లగా వచ్చి భద్రను కాటేసింది. దీంతో భయంతో పరుగులు తీయాల్సింది పోయి భద్ర దైర్యసాహాసం చేశాడు. కాటేసిందని భయపడకుండా అదే పామును చేతిలో దొరికించుకుని నోటితో కరకర నమిలి కొరిచి చంపాడు. ఇదే విషయాన్ని గ్రామంలోని కొంతమందికి చేరవేశాడు. వెంటనే అతనిని నాటు వైద్యునికి వద్దకు తీసుకెళ్లారు. పాము కరిచినా, కొరికి చంపిన నాకేం కాలేదని భద్ర తెలియజేస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.