సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు అంటే.. కొత్త బట్టలు ధరించడం, స్కూల్లో ఫ్రెండ్స్‌కి చాక్లెట్స్ పంచడం, కేక్ కట్ చేయడం.. కుటుంబంతో కలిసి సరాదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తాము. అయితే మారుతున్న కాలంతో పాటు వేడుకల నిర్వహణ తీరు కూడా మారుతోంది. ఈ మార్పు బాగుంటే సరే.. కానీ ట్రెండ్ పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారు కొందరు. శుభామా అని పుట్టినరోజు వేళ.. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బర్త్ డే పార్టీ అంటూ.. అర్థరాత్రి రోడ్ల మీదకు వచ్చి.. వెర్రిమొర్రి వేషాలు వేసే వారి సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగిపోతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ఇళ్లల్లో, జనాలు తిరగని ప్రాంతాల్లో ఇలాంటి వేషాలు వేస్తే.. ఏం కాదు.. కానీ ఆస్పత్రుల్లో ఇంటి పిచ్చి వేషాలు వేస్తే.. రోగులకు ఎంత ఇబ్బంది.
ఇదిగో ఇలాంటి విషయాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. పుట్టినరోజు వేడుకల పేరుతో.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు కొందరు వ్యక్తులు. బెల్ట్‌తో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఆస్పత్రిలో రణరంగం సృష్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దీని మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు యువకులు.. లక్నోలోని ఓ సివిల్ హాస్పిటల్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీరంతా ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది. ఇక వీడియోలో ఉన్న దాని ప్రకారం విద్యార్థులు ఒకరినొకరు బెల్ట్‌తో సరదాగా కొట్టుకుంటూ.. ఆస్పత్రి ఆవరణంలో పరిగెడుతున్నారు. ఇక వీరి ముఖాలు కేక్ పూసుకుని ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సోమవారం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | UP: Visuals of the birthday party celebrations by pharmacy students inside the civil hospital of Lucknow which has attracted the attention of senior authorities initiating an enquiry into the matter; strict action against those found guilty of disrupting hospital peace pic.twitter.com/EJ94y3waoO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022