ఆలయాల్లో దేవుళ్లకు వివిధ రకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. సాధారణంగా పాయసం, చక్కెర పొంగలి వంటి పదార్థాలను దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దేవుళ్లకు నైవేద్యంగా వెరైటీ పదార్థాలను అందిస్తారు. అలానే ఓ ప్రాంతంలో దేవుడికి సిగరెట్లను నైవేద్యంగా అందిస్తుంటారు.
భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు పూజలు చేసి.. తమ కోర్కేలను తీర్చాలని వేడుకుంటారు. అంతేకాక ఇళ్లలో దేవుడికి పూలతో అలంకరణ చేసి ఎంతో నిష్టతో పూజలు నిర్వహిస్తుంటారు. అలానే సమీపంలోని దేవాలయాలకు వెళ్లి.. దేవుళ్లను దర్శించుకుంటారు. అలా ఆలయాలకు వెళ్లిన సమయంలో దేవుళ్లకు వివిధ రకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తుంటారు. సాధారణంగా పాయసం, చక్కెర పొంగలి వంటి పదార్థాలను దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దేవుళ్లకు నైవేద్యంగా వెరైటీ పదార్థాలను అందిస్తారు. మద్యం వంటివాటిని కూడా ప్రసాదంగా కొన్ని ప్రాంతాల్లో దేవుళ్లకు సమర్పిస్తారు. తాజాగా ఓ ప్రాంతంలో దేవుడికి సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాక స్వామి వారి నోటి వద్దనే ఇవి ఉంచుతారు. మరి.. ఈ వింత ఆచారం ఎక్కడో.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ లోని సూరత్ అథ్వాలిన్స్ అనే ప్రాంతంలోని ఆదర్శ్ సోసైటీలో వంజారా భూత్ మామ అనే ఆలయం ఉంది. ఈ దేవాలయంలోని దేవుడు ఎంతో మహిమ గలదని ఇక్కడి ప్రజల నమ్మకం. అలానే ఇక్కడి ప్రజలు దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు పెడుతుంటడం ఇక్కడి ప్రత్యేకత. అలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడి వారి అపారమైన నమ్మకం ఉంది. అందుకే ప్రతి పండగకు ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేసి.. సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఈ ఆలయం చరిత్ర గురించి స్థానికులు అనేక విషయాలు చెప్పారు.
130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం ఇక్కడ నివసించేదంట. ఆ సమయంలో వారిలోని ఒక వంజర మరణించాడు. అతని సమాధిని వారు నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలోని నిర్మించారు. అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని వంజర భూత్ మామ అని పిలుస్తారు. కాలక్రమేణా ఇక్కడ వంజరా భూత్ మామ ఆలయాన్ని స్థానికులు నిర్మించి అభివృద్ధి చేశారు. ఇక్కడే భక్తులు సిగరెట్లు వెలిగించి దైవానికి సమర్పించి.. కొలుస్తున్నారు. అంతేకాక మగాస్ అనే మిఠాయిలను కూడా నైవేద్యంగా పెడతారు.
వాటిని సమర్పిస్తే.. చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. మాగాస్ స్వీట్లను తమ దగ్గర పెట్టుకుంటే మంచి ఉద్యోగం, ధనం లభిస్తుందని కూడా అక్కడ ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అలానే హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని లుట్రు మహాదేవ్ ఆలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ శివాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. మరి.. సిగరేట్లను నైవేద్యంగా సమర్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.