భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. రైళ్లలో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రైల్వే శాఖను నమ్ముకుని కొన్ని లక్షల కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. అయితే ఇంత పెద్ద రవాణా వ్యవస్థను నిర్వహించడం అంత తేలిక కాదు. చాలా ఆటుపోట్లు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల నుంటే వారికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు, పరిస్థితులను చక్కదిద్దేంకు వారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు చెప్పుకోవబోయే ఘటన మీరు సోషల్ మీడియాలో చాలాసార్లు చూసే ఉంటారు. కదులుతున్న రైలులో ఎక్కేందుకు ప్రయత్నించి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కలబుర్గిలోని రైల్వే స్టేషన్ లో జరిగింది. ప్లాట్ ఫామ్ పై ఓ యువతి రైలు కదులుతుండగా లోపలి నుంచి ఒక సంచి అందుకుంది. ఆమె రైలులో ఎక్కేందుకు ప్రయత్నించినట్లు కనిపించలేదు. కానీ, తర్వాత ఓ జంట వచ్చింది. ఆ వ్యక్తి రైలులో ఎక్కేశాడు. కానీ, ఆమె మాత్రం ట్రైన్ లో ఎక్కలేకపోయింది.
అతడిని పట్టుకోగా రైలు కదులుతుండటంతో కింద పడిపోయింది. రైలు- ప్లాట్ ఫామ్ మధ్యలో పడబోతుండగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను పక్కకు లాగాడు. అక్కడే ఉన్న కూలీ, ప్రయాణికులు ఆమెను పక్కకు తీసి ప్రాణాలు కాపాడారు. రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు, అనౌన్స్ మెంట్ లో చెబుతూనే ఉంటారు. కదిలే రైలులో ఎక్కకండి, రైలు ఆగిన తర్వాత మాత్రమే ఎక్కండి, రైలు రన్నింగ్ లో ఉంటే దానికి రెండడుగుల దూరంలో ఉండండి అని. కానీ, చాలా మంది ఆ మాటలను లెక్కచేయరు. అలా రన్నింగ్ ట్రైన్లలో ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, అందరూ ఈ మహిళలాగా అదృష్టవంతులు అయి ఉంటారని అనుకుంటే పొరపాటే అవుతుంది.
#Karnataka | People who travel in trains regularly shud resolve that in 2023 they will not attempt to board when it’s moving.
This woman had a lucky escape in Kalaburagi railway station thanks to alert folks on the platform. pic.twitter.com/x707DdaddQ
— Gautam (@gautyou) January 2, 2023