ప్రస్తుతం కేజీఎఫ్ అంటే తెలియని వారు ఉండరు ఇప్పటి వరకు కేవలం కర్ణాటక ఆ పరిసర ప్రాంతాల వారికే తెలిసిన ఈ బంగారు గనుల ప్రాంతం కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరి సుపరిచితమైంది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 గా విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద వసూల సునామీ సృష్టించింది. కన్నడ స్టార్ యష్ నటించిన ఈ సినిమాలు బంగారు గనులకు పెట్టింది పేరుగా ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంగా తెరకెక్కించారు. ఈ బంగారు గనుల తవ్వకాల చుట్టూ అల్లిన ఈ కథ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని అర్ధం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ కేజీఎఫ్ దాదాపు 22 ఏళ్ల క్రితం నుంచి మూతపడింది. అయితే ఎంతో ఘనకీర్తి కలిగిన కేజీఎఫ్ కి తిరిగి మంచి రోజులు వచ్చినట్లు అనిపిస్తుంది. కేజీఎఫ్ ను పునరుద్ధరించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయాన్ని గనుల శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోలార్ బంగారు గనులకు పూర్వవైభవం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగనున్నాయి. వివిధ కారణాలతో 22 ఏళ్ల క్రితం ఈ కేజీఎఫ్ ను మూసివేశారు. అప్పటి నుంచి కేజీఎఫ్ ప్రాంతం వెలవెలబోతోంది. అయితే ఇటీవ కొంతకాలం నుంచి కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలు మళ్లీ ప్రారంభిస్తారని సాగుతున్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మాటలను నిజం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోలార్ బంగారు గనులపై కేంద్ర నిపుణులు దృష్టి సారించారు. కేజీఎఫ్ పరిసరాల్లో బంగారం తీసేందుకు టెండర్లకు పిలుపునిచ్చారు. 2001లో భూగర్బం నుంచి బయటకు తెచ్చిన మట్టి నుంచి బంగారం తీసేవారు. ఆ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని గనుల శాఖ అధికారులు తెలిపారు. ఇక కేజీఎఫ్ ప్రాముఖ్యత గురించి చూసినట్లయితే..దీనికి ఎంతో ఘనమైన కీర్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దున కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ళ చరిత్ర ఉంది.
హరప్పా, మొహెంజోదారో నాగరికత కాలంలోనే కేజీఎఫ్ గనుల నుంచి బంగారాన్ని వెలికి తీసేవారు. ముఖ్యంగా ఛాంపియన్ రీవ్ అనే గనిలో మూడు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేశారు. అప్పట్లో ఈ గని ప్రపంచంలోనే లోతైన బంగారం గనిగా రికార్డులకెక్కింది. అలా ఈ గనులు వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి. అలాంటి అద్భుతమైన గనుల్లో రాను రాను బంగారం తరిగిపోయింది. చివరకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే.. దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువ అయ్యేది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. తాజాగా కేజీఎఫ్ పనరుద్ధరణ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు దిగాయి. కేజీఎఫ్ నుంచి తిరిగి బంగారం వెలికి తీసేందుకు గనులు శాఖ అధికారులు దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.