సాధారణంగా బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా పోలీసులు చలానా వేయడం జరుగుతుంది. అయితే కేరళలో ఓ విచిత్రమైన ఫైన్ వేశారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. బైక్ లో సరిపడ పెట్రోల్ లేదని రూ.250 జరిమాన విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. బైక్ లో పెట్రోల్ లేకున్న ఫైన్ వైస్తారా? అంటూ నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై కామెంట్స్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..
కేరళ కు చెందిన బసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ ఫీల్ట్ బైక్ పై ఆఫీస్ కు రోజూ వెళ్లి వస్తుండే వాడు. అలానే ఆఫీస్ కు వెళ్లే క్రమంలో వన్ వే స్ట్రీట్ లో రాంగ్ డైరెక్షన్ లో బండి నడిపాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు శ్యామ్ బైక్ ని ఆపాడు. రాంగ్ వేలో వచ్చినందుకు రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు అతను చెల్లించాడు. ఆఫీస్ టైమ్ అవుతుందనే హడావుడిలో చలనాను బ్యాంగ్ లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తీరా ఆఫీస్ కు వెళ్లాక చలాన్ చూసి.. షాకయ్యాడు. అందులో బైక్ లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు ఆ చలాన్ ఫోటో తీసి ఫేస్ బుక్ పో పోస్టు చేశాడు. అది కాస్తా ఫుల్ వైరల్ అయ్యింది. కేరళ ట్రాఫిక్ పోలీసులపై ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి.
అయితే మోటార్ వాహన చట్టం ప్రకారం.. కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A new high in Indian Traffic rules.
Kerala traffic police fined a two wheeler rider for riding with low fuel.@nitin_gadkari 🙏 pic.twitter.com/Pj0SEEgocX— Devil_In_Black (@DementedDevil00) July 27, 2022